గరుడ పురాణం: మరణించినవారివి ఈ వస్తువులు వాడితే ఆత్మ ఆవహిస్తుందట
పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. మరణించిన వ్యక్తికి చెందిన కొన్ని వస్తువులను వారి జ్ఞాపకంగా వాడుతుంటారు. అలా చేయడం కష్టాలు కొనితెచ్చుకోవడమేనని గరుడ పురాణం చెబుతోంది.
సాధారణంగా, కుటుంబ సభ్యుల మరణం తర్వాత, వారి వస్తువులను జ్ఞాపకంగా, గుర్తుగా ఉపయోగిస్తారు, అయితే కొందరు మరణించిన వారి వస్తువులను నాశనం చేస్తారు.
మృతి చెందిన వారికి సంబంధించిన వస్తువులను ఉపయోగించకూడదని కాదుకానీ దానికో పద్ధతుంది... ఇవి పాటించకపోతే చనిపోయిన వారి ఆత్మను ఆకర్షిస్తుందని, ఫలితంగా ఇంట్లో ప్రతికూలతను వ్యాప్తి చేస్తుందని నమ్ముతారు.
ప్రతి వ్యక్తికి తాను ధరించే ఆభరణాల పట్ల ఎంతో అనుబంధం ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం, మరణించిన వ్యక్తికి సంబంధించిన నగలు ధరించకూడదు. వాటిని ధరిస్తే మరణించిన వ్యక్తి శక్తి లేదా ఆత్మ అతని ఆభరణాలను ధరించిన వ్యక్తిని ఆవహిస్తుంది.
అలా జరగకూడదనుకుంటే ఏం చేయాలో కూడా గరుడ పురాణంలో సూచించారు. మీరు వారి ఆభరణాలను ఉపయోగించాలనుకుంటే, ఆ నగలను కరిగించి, వాటితో కొత్త నగలు చేయించుకుని ధరించండి. కొత్త నగలను తయారు చేయించుకుని మీరు ఉపయోగించవచ్చు.
మరణించిన వ్యక్తి తన మరణానికి ముందు తన ఆభరణాలను మీకు బహుమతిగా ఇస్తే, మీరు దానిని ఉపయోగించుకోవచ్చు
గరుడ పురాణం ప్రకారం, మరణించిన తర్వాత కూడా, మరణించిన వ్యక్తి ఆత్మ ప్రాపంచిక అనుబంధాన్ని విడిచిపెట్టదు. అటువంటి పరిస్థితిలో, మీరు వారి దుస్తులను ధరించడం వల్ల వారి ఆత్మను ఆకర్షించవచ్చు. అందుకే ఆ వస్త్రాలు దానం చేయాలి
గరుడ పురాణం ప్రకారం, కుటుంబ సభ్యుల మరణం తరువాత, వారి చేతి గడియారాన్ని కూడా ఉపయోగించకూడదు. చనిపోయినవారి సానుకూల, ప్రతికూల శక్తి వాచ్‌లో నివసిస్తుందని నమ్ముతారు.
చనిపోయిన వారి చేతి గడియారాన్ని ధరించిన వ్యక్తి ప్రతికూల శక్తితో ప్రభావితమవుతాడు. ఫలితంగా అతను చనిపోయిన వారి గురించి మళ్లీ మళ్లీ కలలు కంటాడు