వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అక్షయం అంటే నాశనం లేనిది, తరగనిది అని అర్థం. అందుకే ఈ రోజు చేసే దాన ధర్మాలు, పుణ్యం అత్యధిక ఫలితాలనిస్తాయని చెబుతారు.
అక్షయ తృతీయ అనగానే బాంగారం కొనాలని ప్రచారం చేస్తుంటారు. ఈ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చంటుందంటారు.
వాస్తవానికి అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. ఇదంతా వ్యాపారాలను పెంచుకునేందుకు కొందరు చేస్తున్న ప్రచారం మాత్రమే అంటారు నిజమైన పండితులు.
చాలామందికి తెలియని విషయం ఏంటంటే...కలిపురుషుడి ఐదు నివాస స్థానాల్లో బంగారం ఒకటి
బంగారం అహంకారానికి హేతువు. అంటే కోరి కలిపురుషుడిని ఇంట్లో పెట్టుకుంటున్నారు, అహంకారాన్ని మరింత పెంచుకుంటున్నారని అర్థం
బంగారం అనే ప్రస్తావన ఎందుకొచ్చిందంటే...కొనాలని కాదు దానం చేయమని. ఈ రోజు బంగారం కొనుగోలు చేయడం కన్నా దానం చేయడం ఉత్తమం.
అందరకీ బంగారం దానం చేసేంత స్తోమత ఉండదు కాబట్టి...ఏదో ఒకటి దానం చేయడం వల్ల పుణ్యం అక్షయం అవుతుందన్నది మాత్రం వాస్తవం అంటున్నారు పండితులు.
ఎండలు పెరిగే సమయం కావడంతో అక్షయ తృతీయ రోజు కొత్త కుండలో నీళ్లు పోసి దానం చేయడం మంచిది.
అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితం పొందుతారు
చెప్పులు-గొడుగు-వస్త్రాలు- విసనికర్రలు దానం చేయడం. ఇంకా మజ్జిగ, పానకం, పండ్లు దానం చేయడం ద్వారా మీ పుణ్యం అక్షయం అవుతుంది.