మీరు మోసపోకూడదు అనుకుంటున్నారా - అయితే ఇలా చేయండి



ఆచార్య చాణక్యుడి విధానాలు నేటి ఆధునిక ప్ర‌పంచానికీ ఆనుస‌ర‌ణీయంగా ఉంటాయి



నమ్మకద్రోహానికి గురయ్యామని, నమ్మినవారే మోసం చేశారని బాధపడుతుంటారు..అయితే అలాంటప్పుడు ఎలా ప్రవర్తించాలో చాణక్యుడు బోధించాడు



డబ్బు సంపాదించడమే కాదు దానిని సరైన విధంగా ఖర్చు చేయడం కూడా మీ పురోగతికి కీలకం. అనువుకాని స్థలంలో పెట్టుబడి పెడితే వినాశనం తప్పదు.



ఒక వ్యక్తి తన తప్పుల నుంచే కాకుండా ఇతరుల తప్పుల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాలన్నాడు చాణక్యుడు. ఇలా చేయడం వల్ల మీరు తప్పు చేసే అవకాశాలను తగ్గించుకోవచ్చు.



అబద్ధాలు చెప్పి సాధించిన విజయం ఎంతో కాలం నిలవదు.ఈ రోజు సంతోషాన్ని ఇచ్చినా రేపు ఆ వ్యక్తిని నాశనం చేస్తుంది.



సత్య మార్గాన్ని ఎంచుకునే వ్యక్తి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా సులభంగా పరిష్కారాన్ని కనుగొంటాడు



ఒక వ్యక్తి జ్ఞానం పొందినప్పుడు లేదా బలంగా మారినప్పుడు తన ముందు ఉన్న వ్యక్తిని బలహీనుడిగా పరిగణించడం ప్రారంభిస్తాడు. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి మరొక వ్యక్తిని బలహీనుడిగా పరిగణించకూడదు



మీరు బలహీనంగా భావించే వ్యక్తి తన బలాన్ని మీకు వెల్లడించకపోవచ్చు. మీ నిర్లక్ష్యమే ఏదో ఒకరోజు తన బలంగా మారుతుందని గుర్తుంచుకోవాలి



మన దగ్గరివారు మనకు ద్రోహం చేసినప్పుడు లేదా మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ‌తీసేలా అవమానించినప్పుడు బాధ‌కు గుర‌వ‌డం సర్వసాధారణం



దాని గురించి చింతిస్తూ, ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేయకుండా చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాల‌ను అనుసరిస్తే మీదే పైచేయి
Images Credit: Pixabay