గరుడ పురాణం : ఈ 9 మంది దగ్గర్నుంచి ఆహారం తీసుకోకూడదు



అష్టాదశ పురాణాల్లో ఒకటైన గరుడపురాణాన్ని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు తన సారథి అయిన గరుత్మంతునికి ఉపదేశించగా, వేదవ్యాసుడు రచించారు.



గరుడ పురాణం కేవలం మరణం తర్వాత జీవుడి ప్రయాణం గరించి మాత్రమే కాదు.. ఏ విషయాలు ఆచరిస్తే ఆనందంగా జీవించవచ్చో కూడా వివరించింది.



తొమ్మిది రకాల వ్యక్తుల నుంచి ఆహారం తీసుకుంటే నరకం తప్పదంటోంది గరుడ పురాణం



గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి న్యాయ‌స్థానంలో లేదా చట్టం ద్వారా దోషిగా తేలితే ఆ వ్యక్తి నుంచి ఆహారం ఎప్పుడూ తీసుకోకూడ‌దు. అన్యాయం చేసిన వ్యక్తి చేతి నుంచి ఆహారం మనం స్వీక‌రిస్తే, అతని పాపంలో మనం పాలుపంచుకున్నట్టే



వడ్డీ వ్యాపారం పేరుతో పేదల ప్రాణాలను హరించే వారి నుంచి ఆహారం మాత్రమే కాదు, కొంచెం నీరు కూడా తాగకూడదని గరుడ పురాణం చెబుతోంది.



మ‌హిళ‌లు తాము వెళ్లే మార్గం మంచిది కాదని తెలిసినప్పటికీ ఆమె ఇష్టపూర్వకంగా ఆ మార్గంలో వెళితే ఆమె నుంచి ఆహారం తీసుకోకూడ‌దు



అంటు వ్యాధి లేదా నయం చేయలేని తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి నుంచి ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు. కొన్నిసార్లు ఆ వ్యక్తి తన పాపం వల్ల అనారోగ్యం అనుభ‌వించ వ‌చ్చు



గరుడ పురాణం ప్రకారం హిజ్రాల నుంచి ఆహారం తీసుకోరాదు. హిజ్రాలకు మనం దానం చేస్తే పుణ్యం వస్తుంది



మనిషికి ప్రధాన శత్రువు కోపం. కోపంతో ఉన్న‌ వ్యక్తి భావోద్వేగాలను పట్టించుకోడు. అలాంటి వారి నుంచి ఆహారాన్ని స్వీకరిస్తే మన జీవితంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.



మోసపూరిత స్వభావం గల వ్యక్తుల నుంచి ఆహారం ఎప్పుడూ తీసుకోకూడదు. మోసం చేయడం అత్యంత ఘోరమైన పాపం, మోసపోయిన వ్యక్తిని మాత్రమే కాకుండా అతని కుటుంబాన్ని, స‌న్నిహితుల‌నూ బాధపెడుతుంది.



ఇత‌ర ప్రాణుల ప‌ట్ట దయ, క‌రుణ‌ లేని వారి నుంచి ఆహారాన్ని ఎప్పుడూ స్వీకరించకూడదు.



గరుడ పురాణం ప్రకారం, మ‌త్తు ప‌దార్థాల‌కు బానిసైన వారి నుంచి అవి విక్రయించే వ్యక్తి నుంచి ఆహారం తీసుకోరాదు. వారి పాపంలో మనం కూడా భాగ‌స్వాములు అవుతాం.


garuda puranam,Puranam,one of ashtadasha puranas, గరుడ పురాణం
Images Credit: Pinterest