చాణక్య నీతి: జీవితంలో కష్టాలు ఉండకూడదంటే ఆ ఒక్కటీ అదుపులో ఉండాలి
అనవస్థికాయస్య న జనే న వనే సుఖం । జనో దహతి సంఘాద్ వాన్ సగ్వివర్జనాత్ ॥
ఆచార్య చాణక్యుడు తన శ్లోకాల ద్వారా ఒక వ్యక్తి ఎదుర్కొనే సమస్యలకు మూల కారణం అతని మనస్సు అని స్పష్టంగా చెప్పాడు.
ఒక వ్యక్తి మనస్సు అదుపులో లేకుంటే ఎప్పుడూ సంతోషంగా, సంతృప్తిగా ఉండలేడు.
ప్రపంచంలోని అన్ని సౌకర్యాలు, సదుపాయాలు అతనికి అందుబాటులో ఉన్నప్పటికీ చంచలమైన మనస్సు ఆ వ్యక్తిని ఇబ్బంది పెడుతుంది
మనసుని అదుపుచేయలేనివారు ఏ పని ప్రారంభించినా విజయం సాధించలేరు
మనసును అదుపులో ఉంచుకునే శక్తి లేని వ్యక్తులు పెద్ద కుటుంబంలో ఉన్నా ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండరు
ఎంత ఉన్నా, ఏం సాధించినా నిత్యం అసంతృప్తితో ఉంటారు
చాణక్య నీతి ప్రకారం మనస్సుపై నియంత్రణ కోల్పోయిన వ్యక్తికి ప్రజల సాంగత్యం బాధ కలిగిస్తుంది. ఎందుకంటే అతను ప్రజల విజయాన్ని చూసి అసూయపడతాడు. అందువల్ల అతను ఎప్పుడూ సంతోషంగా ఉండలేడు
ఇలాంటి వ్యక్తులు తాము ప్రారంభించిన పని పూర్తిచేయలేక లక్ష్యం చేరుకోలేక పరాజయం పొందుతారు