చాణక్య నీతి: జీవితంలో ఈ ముగ్గురినీ ఎప్పుడూ దూరం చేసుకోవద్దు
నంద వంశ నిర్మూలను మౌర్యవంశ స్థాపనకు కారకుడైన కౌటిల్యుడు కేవలం అర్థశాస్త్రం, రాజనీతిజ్ఞత మాత్రమే కాదు. సుఖమయ జీవితానికి పాటించాల్సిన చాలా నియమాలను చెప్పాడు.
ఆనందం, విచారం జీవితంలో రెండు ముఖ్యమైన భాగాలు. ఆనందాన్ని పంచుకోవడం వల్ల సంతోషం పెరుగుతుంది. బాధను పంచుకోవడం దుఃఖాన్ని తగ్గిస్తుంది. సంతోషకరమైన జీవితానికి చాణక్యుడు అనేక సూత్రాలను తెలిపాడు.
ఎలాంటి పరిస్థితి ఎదురైనా మనకు అండగా ఉండి నడిపించే ఈ ముగ్గరు వ్యక్తులను ఎప్పటికీ దూరం చేసుకోవద్దన్నాడు చాణక్యుడు
1. అనుకూలవతి అయిన భార్య 2. సద్గుణ సంపన్నుడైన కుమారుడు 3. మంచి స్నేహితుడు
సంస్కారవంతురాలు, సున్నిత మనస్తత్వం కలిగిన భార్య ఉండటం భర్త అదృష్టం. ఇలాంటి భార్య ప్రతికూల పరిస్థితుల్లో భర్తకు నీడలా నిలుస్తుంది.
భర్తకు ఎదురయ్యే ప్రతి క్లిష్ట పరిస్థితినీ దృఢ సంకల్పంతో ఎదుర్కొనేందుకు, ఆ పరిస్థితుల్లో పోరాడే ధైర్యాన్నిస్తుంది. సంక్షోభ సమయాల్లో కుటుంబానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది అనుకూలవతి అయిన భార్య.
చాణక్యుడు చెప్పినట్టు సద్గుణ సంపన్నుడైన కొడుకు ఉండడం కన్నా ఆ తల్లిదండ్రులకు మంచి ఆస్తి ఏముంది. ఇలాంటి కొడుకు తల్లిదండ్రులను కష్టకాలంలో ఎప్పటికీ వదిలేయడు
మంచి స్నేహితుడు ఉంటే జీవితంలో అసలు కష్టమే రాదంటారు. ఎందుకంటే కష్టంకన్నా ముందు స్నేహితుడు నిలుస్తాడంటాడు చాణక్యుడు
ఉత్తమ స్నేహితుడు ఎప్పుడూ మిమ్మల్ని తప్పుడు మార్గంలో వెళ్లనివ్వరు. నిస్వార్థంగా, ప్రతిఫలాక్ష లేకుండా, నిండు మనసుతో మీ క్షేమం కోరుకుంటారు. అలాంటి వ్యక్తుల సహవాసాన్ని ఎప్పుడూ వదులుకోవద్దంటాడు చాణక్యుడు
అనుకూలవతి అయిన భార్య, సద్గుణ సంపన్నులైన పిల్లలు, మంచి స్నేహితుడు...ఈ ముగ్గురినీ ఎప్పటికీ వదిలిపెట్టకుండా ఉంటే ఆ జీవితం సంతోషమయం అని బోధించాడు చాణక్యుడు