ABP Desam


నవగ్రహాలకు కోపం తెప్పించే పనులివే


ABP Desam


సూర్యుడు
ప్రత్యక్ష నారాయణుడిగా పూజలందుకునే సూర్యభగవానుడికి పితృదేవతలను దూషిస్తే కోపం వస్తుంది. ముఖ్యంగా సూర్య దేవుని ఎదురుగా మల మూత్ర విసర్జన , దంతావధానం చేయకూడదని చెబుతారు పండితులు.


ABP Desam


చంద్రుడు
అద్దం పుట్టడానికి కారణం చంద్రుడు అని చెబుతారు. అందుకే అద్దంలో దిగంబరంంగా చూసుకోవడం, వెక్కిరించడం, వింతవింత హావభావాలు ప్రదర్శించడం చేయరాదు. ఇలాంటి పనులు చేస్తే చంద్రుడి ఆగ్రహానికి గురవుతారు


ABP Desam


కుజుడు
కుజుడుకి ఎవరైనా అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతో కోపం వస్తుందట. ముఖ్యంగా వ్యవసాయ పనులకు సంబంధించి మోసం జరిగితే కుజుడు ఆగ్రహం నుంచి అస్సలు తప్పించుకోలేరని చెబుతారు పండితులు


ABP Desam


బుధుడు
బుధుడికి చెవిలో వేలుపెట్టి తిప్పుకునేవారంటా పరమ చిరాకట. అందులోనూ బుధవారం ఇలాంటి పనులు చేస్తే అస్సలు సహించడు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా, తెలివైనోడిని అని విర్రవీగినా వాళ్ల సరదా బుధుడు తీర్చేస్తాడని చెబుతారు.


ABP Desam


గురువు
దేవతల గురువుగా చెప్పే బృహస్పతికి..ఎవరైనా గురువుని కించపరిస్తే ఆగ్రహం చెందుతాడు.విద్యాబుద్ధులు నేర్పించి, ఉన్నతంగా తీర్చి దిద్దిన గురువులపట్ల భక్తి, శ్రద్ధ ఉండాలికానీ దూషించడం సరికాదు. గురువుని కించపరిస్తే ఆగ్రహించే గురువు...వారిని పూజించి గౌరవిస్తే మాత్రం అనుగ్రహిస్తాడట.


ABP Desam


శుక్రుడు
శుక్రుడికి బంధాల మధ్య వివాదాలంటే కోపం. ప్రేమ కారకుడిగా చెప్పే శుక్రుడు..భార్య-భర్త మధ్య బంధం సరిగా లేకున్నా, ఒకర్నొకరు అగౌరవ పరుచుకున్నా అస్సలు నచ్చదు. మరీ ముఖ్యంగా శుచీ శుభ్రత లేని ఇల్లు, నిత్యం గొడవలు జరిగే ఇంటిపై శుక్రుడి ఆగ్రహం ఉంటుంది.


ABP Desam


శని
శని...ఈ పేరు వింటేనే వణికిపోతారు. ఎలాంటి శని బాధలు లేనివారు కూడా శని ఆగ్రహానికి గురవుతారు. వాళ్లెవరంటే...పెద్దల్ని కించపరిచేవారు, మురుగుదొడ్లు శుచిగా ఉంచనివారు, తల్లిదండ్రులను చులకనగా చూసేవారిపై శని ఆగ్రహం ఉంటుంది.


ABP Desam


రాహువు
నవగ్రహాల్లో రాహువుకి ఎప్పుడు కోపం వస్తుందో తెలుసా...వైద్య వృత్తి పేరుతో మోసం చేసేవారిపై, సర్పాలను ఏమైనా చేసినా రాహువు ఆగ్రహానికి గురికాకతప్పదు.



కేతువు
జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడిన వారిపై కేతువు ఆగ్రహం చెందుతాడు. మోక్ష కారకుడు అయిన కేతువుకి... పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపిస్తాడు. జాతకంలో కేతువు సంచారం బాగాపోతే పిశాచపీడ కలుగుతుంది.



Images Credit: Pixabay