పసుపు, కుంకుమ కిందపడితే అశుభమా!పసుపు కుంకుమ..సుమంగళీ చిహ్నాలైన ఈ రెండింటికీ హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది.ఇంటికి అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా బొట్టు పెట్టి మరీ పంపిస్తారు. శుభకార్యానికి ఆహ్వానించినప్పుడు కూడా బొట్టుపెట్టి పిలుస్తారు.ఎంతో పవిత్రంగా భావించే పసుపు, కుంకుమ ఒక్కోసారి పొరపాటున చేజారిపడిపోతుంది. అలాంటప్పుడు చాలామందిలో భయం మొదలవుతుంది. అదో అపశకునం అని, ఏదో చెడు జరగబోతోందని భావిస్తారు.పసుపు, కుంకుమ కిందపడితే ఏదో జరిగిపోతుందనేది అపోహమ మాత్రమే అంటారు పండితులుఅనుకోకుండా కుంకుమ కింద పడినప్పుడు అలా పడినచోట భూదేవికి బొట్టుపెట్టి మిగతా కుంకుమను చెట్లలో వేయాలిమంగళ, శుక్రవారాల్లో కుంకుమ కిందపడితే..ఈ రోజు ఎవరో ఒక ముత్తైదువుకిబొట్టు పెడితే చాలంటారుఏదైనా పూజ, వ్రతం చేస్తున్నప్పుడు కుంకుమ, పసుపు చేజారి పడినా అతి ఎంతమాత్రం అపశకునం కాదువాస్తవానికి కుంకుమ కిందపడడం అంటే భూదేవికి బొట్టుపెట్టాం అనేందుకు సంకేతం...అంటే మన అమ్మకు మనం బొట్టుపెట్టాం అన్నమాటఏంకాదులే అని, భూదేవికి బొట్టు పెట్టినట్టు ఉంటుందని చీటికి మాటికి కావాలని కింద పడేయడం కూడా మంచిది కాదుపొరపాటున కిందపడినప్పుడు మాత్రం అపశకునంగా భావించి ఏదో జరిగిపోతుందనే అపోహవద్దని చెప్పడం మాత్రమే పండితుల ఉద్దేశంImages Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఎందుకు ఉండకూడదు

View next story