దర్శనం అయ్యాక గుడిలో ఎందుకు కూర్చోవాలి!



గుడి ప్రశాంతతకు మారుపేరు



దేవుడిని దర్శించుకోగానే మనలో కోపం, అహం, ఆవేశం, స్వార్థ చింతన కొద్దిసేపు దూరమవుతుంది



వెనువెంటనే జనారణ్యంలోకి వెళితే మళ్లీ మనసు ఎప్పటిలా మారిపోతుంది



అందుకే కొద్దిసేపు దర్శనం తర్వాత కూర్చుంటే ఆ ప్రదేశంలో ఉన్న ప్రశాంతత ప్రభావం మనసుపై పడుతుంది



ఆయా దేవాలయాల్లో చేసిన పూజలు, యాగాల ఫలితంగా మనసులో మాలిన్యం కరుగుతుంది



కొద్దిసేపు అయినా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన సమయాన్న గడపగలుగుతాం



మరీ ముఖ్యంగా దైవ సన్నిధిలో ఉన్నంత సేపూ ఇతర విషయాలపై ధ్యాస మళ్లదు..కేవలం దేవుడిపైనే ఉంటుంది..అంటే ఇది కూడా ప్రాణాయామం లాంటిదే...



ఈ కారణంగానే దర్శనానంతరం గుడిలో కొద్దిసేపు కూర్చోవాలని చెబుతారు



Images Credit: Pinterest