ఈ 4 విషయాల్లో జాగ్రత్తపడకపోతే అంతే సంగతులు



ఎవరి జీవితం అయినా...స్థానం, కుటుంబం, అభ్యాసం, మతం చుట్టూ తిరుగుతుంది.



కుటుంబాన్ని సురక్షితంగా ఉంచడానికి ఒక వ్యక్తి కష్టపడి పనిచేస్తాడు. కానీ కొన్నిసార్లు చిన్న పొరపాటు కూడా భవిష్యత్ ని అంధకారంలో పడేస్తుంది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఎలాంటి నియమాలు పాటించాలో చెప్పాడు చాణక్యుడు



విచ్ఛేన్ రక్ష్యతే ధర్మ విద్యా యోగేన్ రక్ష్యతే.
మృదునా రక్ష్యతే భూప్: సత్స్త్రియ రక్ష్యతే గృహమ్ ॥



చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకం అర్థం ఏంటంటే...డబ్బు ద్వారా మతం, యోగం ద్వారా జ్ఞానాన్ని స్వీకరించవచ్చు. దయ గ‌ల‌ రాజు మంచి పాలన అందిస్తాడు. స‌ద్గుణ సంప‌న్నులైన‌ స్త్రీలు కుటుంబాన్ని సమ‌ర్థంగా రక్షించుకుంటారు.



జ్ఞాన భద్రతే విజయ రహస్యం
నిరంతరం ప్రయత్నించినప్పుడే జ్ఞానం ఫలవంతం అవుతుందని చాణక్యుడు స్ప‌ష్టంచేశాడు.విద్య కోసం నిరంతర ప్రయత్నాలు చేసే వారు దుఃఖ సమయాల్లో ఎప్పుడూ భయపడరు..ఎందుకంటే ఇది మిమ్మల్ని ప్రతి కష్టం నుంచి బయటపడేస్తుంది.



మ‌ర్యాద పూర్వ‌క ప్ర‌వ‌ర్త‌న‌
అధికారంలో కూర్చోవాలన్నా, నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలన్నా మీ కంటే కింది స్థాయి వ్యక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. హోదా చూసి ఎప్పుడూ గర్వపడకూడదు



డబ్బు, మతాన్ని కాపాడుకుంటేనే భవిష్యత్‌
డబ్బు లేకుండా మతానికి సంబంధించిన ఏ పని జరగదని చాణక్యుడు చెప్పాడు. ఈ ప్రపంచంలో మతమే సర్వస్వం, అదే సారాంశం.



అందుకే మతాన్ని రక్షించాలి. మతపరమైన పనిలో డబ్బు ఖర్చుచేయడం ఎంత ఆనందాన్నిస్తుందో...విప‌త్క‌ర‌ సమయాల్లో ఎవరినీ ఆశ్ర‌యించ‌వ‌ల‌సిన‌ అవసరం లేకుండా డబ్బు ఆదాచేసుకోవడం కూడా అంతే మంచిది



ఇంటిని సురక్షితంగా ఉంచుకోవాలి
స్త్రీ ఇంటికే కాదు కుటుంబానికీ వెన్నెముక అని చాణక్యుడు చెప్పాడు. సంస్కారవంతురాలు, సద్గుణ సంపన్నురాలు ఇంట్లో ఉండడం వల్ల కుటుంబం వర్ధిల్లడమే కాకుండా తరతరాలకు మోక్షం లభిస్తుంది



Images Credit: Pixabay