చాణక్య నీతి: ఇలాంటి వాళ్ల కన్నా పాము బెటర్!



తేలుకి తోకలో, పాముకి తలలో, మనిషికి నిలువెల్లా విషం అని సుమతీ శతకంలో ఉంటుంది కదా.. అదే విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పాడు ఆచార్య చాణక్యుడు



ఓ వ్యక్తితో స్నేహం చేసేముందు చాలా ఆలోచించాలి, జీవితాంతం ఆ స్నేహం కొనసాగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి



దుష్టుడితో స్నేహం మీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తుంది...అందుకే ఓ వ్యక్తి గురించి సమగ్రంగా తెలుసుకోకుండా స్నేహం చేయరాదు



పాము లేదా దుష్ట వ్యక్తిని ఎంచుకోవాలనుకుంటే పామే బెటర్ అంటాడు చాణక్యుడు



ఇదే విషయాన్ని శ్లోక రూపంలో ఇలా చెప్పాడు
'దుర్జనేషు చా సర్పేషు వరమ్ సర్పో నా దుర్జనః'



చెడ్డ వ్యక్తి-పాము..ఈ రెండింటిలో పామునే ఎంచుకోవడం మంచిదంటాడు ఆచార్య చాణక్యుడు



ఎందుకంటే పాము ఒకసారి మాత్రమే కరిస్తుంది, కానీ ఒక దుష్టుడు ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటాడు..అడుగడుగునా కాటేస్తూనే ఉంటాడు



సహజంగా దుష్టత్వం ఉన్నవారి బుద్ధి ఎప్పటికీ మారదు..వారు నాశనం కావడంతో పాటూ మిమ్మల్ని కూడా పాతాళానికి లాగేస్తారు...



అలాంటివారితో స్నేహం మీ వ్యక్తిత్వం గురించి ప్రశ్నలు లేవనెత్తుతుందని హెచ్చరించాడు చాణక్యుడు



Images Credit: Pixabay