గరుడ పురాణం: ఇలా చేస్తే ప్రతికూల శక్తులను ఆహ్వానించినట్టే



అష్టాదశ పురాణాల్లో ఒకటైన గరుడపురాణాన్ని సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు తన సారథి అయిన గరుత్మంతునికి ఉపదేశించగా, వేదవ్యాసుడు రచించారు.



ఈ పురాణంలో మూడు భాగాలున్నాయి
ఆచారకాండ ( కర్మకాండ)
ప్రేతకాండ ( ధర్మకాండ)
బ్రహ్మకాండ( మోక్షకాండ)



గరుడ పురాణం కేవలం మరణం తర్వాత జీవుడి ప్రయాణం గరించి మాత్రమే కాదు.. ఏ విషయాలు ఆచరిస్తే ఆనందంగా జీవించవచ్చో కూడా వివరించింది



ప్రతి ఒక్కరికీ బాగా సంపాదించాలని , సుఖమయమైన జీవితం గడపాలని ఉంటుంది..అలా గడిపేందుకు అదృష్టం కలసి రావాలి.. అందుకు మీరు మార్గం వేయాలి



కొందరు విడిచిన దుస్తులు స్నానం తర్వాత మళ్లీ ధరిస్తుంటారు..ఇలా చేసేవారిని దురదృష్టం వెంటాడుతుంది



స్నానానంతరం కూడా అవే దుస్తులు వేసుకునే వారికి లక్ష్మీ కటాక్షం ఉండదు..అదృష్టం ఆమడ దూరంలో ఆగిపోతుంది



ప్రతి రోజూ స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించాలి. సువాసనగల దుస్తులు ధరించడం వల్ల ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం మీవెంటే ఉంటుందని వివరిస్తోంది గరుడ పురాణం



ఇక స్నానానంతరం అవే దుస్తులు వేసుకోరాదని స్నానం మానేస్తారేమో...నిత్యం స్నానం చేయడం కూడా అంతే ముఖ్యం



రోజూ స్నానమాచరించని వ్యక్తులలోకి ప్రతికూల శక్తులు త్వరగా ఆకర్షితమవుతాయి



అందుకే దేహమే దేవాలయం అంటారు...నిత్యం ధూప, దీప నైవేద్యాలు సాగితేనే దేవాలయం అవుతుంది..లేదంటే పాడుబడుతుంది. అలాగే శరీరం కూడా



రోజూ స్నానమాచరించి పరిశుభ్రమైన దుస్తులు ధరించి భగవంతుడిని ఆరాధించేవారి జీవితంలో అశుభాలుండవని చెబుతోంది గరుడ పురాణం
Images Credit: Pinterest