సాయంత్రం సమయంలో తలుపులు ఎందుకు తీసి ఉంచాలి సాయంకాలం సమయంలో తలుపులు మూయకూడదంటారు పెద్దలు ముఖ్యంగా సూర్యాస్తమయం అయి..లైట్లు వేసే సమయంలో తలుపులు అస్సలు వేయొద్దంటారు వెనుక తలుపులు మాత్రం తప్పనిసరిగా మూసిఉంచాలని చెబుతారు సంధ్యాసమయంలో ఇంటి ప్రధాన ద్వారం నుంచి లక్ష్మీదేవి లోపలకు అడుగుపెడుతందని అందుకే తీసి ఉంచాలంటారు. ఇంటి వెనుక ద్వారం నుంచి జ్యేష్టా దేవి అడుగుపెడుతుంది కనుక మూసి ఉంచాలని చెబుతారు అందుకే సంధ్యా సమయంలో ఇల్లు శుభ్రం చేసి లైట్లు వేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు మరికొందరు ద్వారం దగ్గర దీపం వెలిగించి, ద్వారానికి బొట్టు పెట్టి మరీ లక్ష్మీదేవికి స్వాగతం పలుకుతారు ఉదయం దీపం వెలిగించడం కుదరకపోతే సంధ్యాదీపం వెలిగించినా శుభప్రదం అంటారు పండితులు Images Credit: Pinterest