ఇలాంటి పెళ్లిని పైశాచిక వివాహం అంటారు



హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహానికి చాలా ప్రాముఖ్యత ఉంది.పెద్దల శాస్త్రాల ప్రకారం, వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో వధూవరులు ఒకరి నొకరు పాణి గ్రహణం చేసుకోవడమే వివాహం.



పురాణాల ప్రకారం వివాహంలో చాలా రకాలున్నాయి..అవేంటంటే..



కన్యను అలంకరించి వరుడికి ఇచ్చి జరిపించే వివాహం బ్రహ్మ వివాహం



యజ్ఞం చేయడం కోసం బుత్విక్కుకు కన్యని దక్షిణగా ఇవ్వడాన్ని దైవ వివాహం అంటారు



ఆవు, ఎద్దును దానం చేసి ఆపై కన్యను దానంగా ఇవ్వటాన్ని అర్ష వివాహం అంటారు



మహానుభావుడికి ప్రియురాలిగా సహ ధర్మ చారిణిగా ఉండమని ఆదేశించి కన్యని ఇవ్వడాన్ని ప్రాజపత్య వివాహం అంటారు



తల్లీ, తండ్రి అనుమతి లేకుండా ఇరువురూ పెళ్లి చేసుకోవడాన్ని గాంధర్వ వివాహం అంటారు



కన్యను బలాత్కారంగా తీసుకెళ్లి వివాహం చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటారు



కన్య నిదుర పోయేటప్పుడు, ఏమర పాటుగా ఉన్నప్పుడు… ఆమెకు తెలియకుండా తాళి కట్టి భార్యగా చేసుకుంటే ఆ వివాహాన్ని పైశాచిక వివాహం అంటారు.



ఇలాంటి వివాహాలన్నీ వేద కాలంలోనే ఎక్కువగా జరిగేవి..ఇప్పుడు కేవలం పెద్దలు కుదిర్చిన వివాహం, ప్రేమ వివాహం రెండే రకాలు



Images Credit: Pinterest