చాణక్య నీతి: ఇలాంటి పనులు చేస్తే మీ మొదటి శత్రువు మీ జీవితభాగస్వామే



భార్యాభర్తల మధ్య సంబంధాలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అర్థం చేసుకునే సామర్థ్యంపై ఆధార‌ప‌డి ఉంటాయి.



పరస్పర అవ‌గాహ‌న‌ లోపించిన ఇళ్లలో తరచూ గొడవలు జరుగుతుంటాయి



అశాంతి, మానసిక ఒత్తిడి పెరిగినప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు శత్రువులుగా భావిస్తుంటారు



భార్యాభర్తల మధ్య బాంధవ్యం బాగాలేకపోతే ఒకరికొకరు శత్రువులవుతారని చాణక్యుడు చెప్పాడు



చాణక్య నీతి ప్రకారం, భర్త తన భార్యకు ఏ పరిస్థితుల్లో శత్రువు అవుతాడో తెలుసుకుందాం



స్త్రీ చెడు స్వభావం కలిగి ఉంటే, అసంబద్ధమైన పనులు చేస్తే, పరాయి పురుషుల పట్ల ఆకర్షితురాలైతే, ఆమె భర్త ఆమెకు మొదటి శత్రువు



బాధ్యతారహితంగా ప్రవర్తించే భార్యను భర్త అడ్డుకుంటే..ఆమె భర్తను శత్రువులా చూస్తుంది



భార్యాభర్తలిద్దరిలో ఏ ఒక్కరు దుర్మార్గపు స్వభావం కలిగి ఉంటే, మరొకరు దాని దుష్పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది



భార్య చేసిన తప్పులకు భర్త, భర్త చేసిన తప్పులకు భార్య శిక్ష అనుభవించాలి. అందుకే భార్యాభర్తలిద్దరూ వైవాహిక జీవితంలో తెలివిగా జీవించాలి.



Images Credit: Pixabay