వాస్తు టిప్స్: మీ బెడ్ రూమ్ లో అద్దం ఈ దిశగా అస్సలు పెట్టొద్దు



ఇంటిలో మెయిన్ బెడ్‌రూమ్‌ నైరుతీమూలన ఏర్పాటు చేసుకోవాలి



పడక గదిలో బుక్‌ షెల్ఫులు, డ్రసింగ్‌ టేబుల్స్‌...ఇవన్నీ పడమర వైపు లేదనైఋతి దిశలో అమర్చుకోవాలి



పడక గదిలో అద్దం లేకపోవడం మంచిది..ఒకవేళ ఉన్నా మీ బెడ్‌కు ఎదురుగా గోడకు అమర్చకూడదు



ఎప్పుడూ కూడా అద్దం చూస్తూ నిద్రలేవకూడదు...మీరు నిద్రపోతున్నప్పుడు అద్దం మీ ఎదురుగా ఉండి చూసేలా ఏర్పాటు చేయకూడదు. ఇలా చేస్తే అపశకునం, అనారోగ్యం అని చెబుతారు వాస్తు పండితులు



చాలామంది మంచానికి షెల్పులు చేయించుకుంటారు. అందులో చెత్తా చెదారం, పాత వస్తూవులూ, పనికిరాని వస్తువులు, వినియోగించని దుస్తులు అందులో కుక్కేస్తారు..కానీ అది పాతసామాన్లు పెట్టే చోటుకాదని గుర్తించాలంటారు వాస్తు పండితులు



అక్వేరియం ఎంత అందమైనది అయినా..మీకెంత ముచ్చట ఉన్నా పడకగదిలో అస్సలు ఉంచకూడదు



పడక గదిలో నిద్ర లేవగానే చూసి నమస్కరించుకునేందుకు దేవుళ్ల ఫొటోలు పెడతారు..కానీ వాస్తురీత్యా ఇది కూడా మంచిది కాదు. పడకగదిలో దేవుళ్ల ఫొటోలు ఎప్పుడూ ఉండకూడదు.



ఇంట్లో నైఋతి దిక్కున ఏర్పటు చేసీన మాస్టర్‌ బెడ్‌రూమ్‌ను ఆ ఇంటి యజమానే వాడుకోవాలి కానీ పిల్లలకోసం, గెస్టు రూమ్ లా , ఇతరత్రా అవసరాల కోసం ఉంచకూడదు



పడక గదిలో బెడ్‌ ఎప్పుడూ దక్షిణం, పడమర గోడలకు ఆనుకుని కానీ ఆ దిక్కులవైపున్న గోడలకు చేరువగా కానీ ఉండాలి



పడక గదిలో ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఉంచరాదు. ఫోన్‌, టీవీలను కూడా బెడ్ రూమ్ లో పెట్టుకోరాదు
పడకగది డోర్‌కు ఎదురుగా బెడ్‌ కనిపించకూడదు



డబల్‌ బెడ్‌ అయినప్పటికీ.. దానిపై సింగిల్‌ మేట్రెస్‌ మాత్రమే ఉండాలి. రెండు పరుపులు అస్సలు వేయకూడదు