మీ ఇంట్లో బల్లులున్నాయా? జరిగేది ఇదే! శరీరంపై బల్లి పడితే వెంటనే ఉలిక్కిపడతాం. ఎక్కడ పడిందో తెలుసుకుని మంచో చెడో తెలుసుకుంటాం. మరి, ఇంట్లో బల్లులు కాపురం పెడితే? ఇంటికి మంచిదేనా? బల్లులు ఇంట్లో ఉండవచ్చా? ఇంట్లో బల్లి కనిపిస్తే జీవితంలోకి ఏదో కొత్త విషయం రాబోతోందని అర్థమట. కాబట్టి బల్లి ఇంట్లో ఉండొచ్చు. అదృష్టం, సంపద మీ దరి చేరబోతున్నాయనేందుకు గుర్తుగా ఇంట్లో బల్లి కనిపిస్తుందట. ఇంట్లో బల్లి కనిపించిందంటే మీ ఇల్లు సురక్షితమైంది, ఆశ్రయం ఇచ్చేందుకు అనువైందని అర్థం. కొన్ని దేశాలలో ఇంట్లో ఆత్మీయుల మరణం తర్వాత బల్లి కనిపిస్తే శుభశకునంగా భావిస్తారు. తోక తెగిన బల్లి కనిపిస్తే.. అది మీరు జీవితం కోసం చాలా కష్టపడుతున్నారనేందుకు ప్రతీక. తోక లేని బల్లి కనిపిస్తే మీ చుట్టూ నమ్మక ద్రోహులు చేరారని అర్థం చేసుకోవాలట. ఇకపై బల్లి ఇంట్లో కనిపిస్తే కంగారు పడొద్దు. మీద పడితేనే దోషాలుంటాయి. వాటికి పరిష్కారాలూ ఉంటాయి. Images Credit: Pexels, Pixabay and Unsplash