చాణక్య నీతి: ఈ లక్షణాలున్న అమ్మాయినే పెళ్లిచేసుకోవాలన్న చాణక్యుడు



ప్రతి అబ్బాయి పెళ్ళికి ముందు ఒక అమ్మాయి గురించి ఈ నాలుగు విషయాలను తెలుసుకోవాలని తన నీతిశాస్త్రంలో ఓ శ్లోకం ద్వారా చెప్పాడు ఆచార్య చాణక్యుడు.



వారయేత్ కులజాం ప్రగ్యో విరూపమ్పి కన్యకం
రూపశిలం న నీచస్య మ్యారేజ్ : సదృశే కులే



పెళ్ళికి ముందు ఆకారాన్ని కాకుండా గుణం చూసి పెళ్లిచేసుకోవాలని చెప్పిన చాణక్యుడు..ముఖ్యంగా నాలుగు విషయాలు గమనించాలన్నాడు. అవేంటంటే



అందం కాదు గుణం చూడాలి
అందంగా కనిపిస్తోంది..ఆకట్టుకునేలా ఉంది..సిగ్గుతో చక్కగా మెలికలు తిరుగుతోందని అమ్మాయి అందం చూసి ఎంపిక చేసుకుంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధపడాల్సి ఉంటుందని చెప్పాడు చాణక్యుడు.



మాట్లాడేవిధానం, మంచి గుణం కలిగిన అమ్మాయిని ఎంచుకుంటే జీవితం సంపూర్ణంగా సంతోషంగా ఉంటుందని సూచించాడు చాణక్యుడు.



ఓర్పు సహనం ఉండాలి
కుటుంబాన్ని నడిపే మహిళకు ముఖ్యంగా ఉండాల్సింది ఓర్పు, సహనం..ఆ రెండూ లేనప్పుడు వాతావరణం ఎప్పటికీ ఇబ్బందికరంగానే ఉంటుంది. కొన్ని విషయాలపై స్పందించే తీరుని బట్టి ఆ వ్యక్తికి సహనం, ఓర్పు ఉందో లేదో తెలుసుకోవచ్చంటాడు చాణక్యుడు



సంస్కృతి, సంప్రదాయాలు
ట్రెండ్ కి తగినట్టు ఎలా ఉన్నా, ఎలా మారినా..కుటుంబంలో పాటించాల్సిన కొన్ని పద్దతులుంటాయి. వాటిని పాటించగలదో లేదో ఎలా తెలుసుకోవాలంటే ఆమె పెరిగిన కుటుంబ వాతావరణం గమనించాలి.



కోపం
కోపం అమ్మాయిలకు మాత్రమే కాదు ఎవ్వరికైనా ప్రధమ శత్రువు. తన కోపమె తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని ఊరికే చెప్పలేదు. మీ జీవితంలోని అమ్మాయిని ఆహ్వానిస్తున్నప్పుడు ఇదే విషయాన్ని గమనించాలని సూచించాడు చాణక్యుడు.



Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

అర్జున ఫాల్గుణ అంటే పిడుగుల నుంచి ప్రమాదం తప్పిపోతుందా!

View next story