చీపురు ఎప్పుడు కొనొచ్చు, ఎప్పుడు కొనకూడదు



మంగళవారం, శుక్రవారం రోజుల్లో చీపుర్లు కొనకూడదు



మహాలయ పక్షం అంటే భాద్రపదమాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురు కొనుగోలు చేయకూడదు



గ్రహణానికి ముందు రోజు, గ్రహణం రోజు, గ్రహణం తర్వాత రోజు చీపురు కొనకూడదు



పండుగ రోజుల్లో, ఇంట్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నప్పుడు చీపురు కొనుగోలు చేయరాదు



హస్తా, శ్రవణం, రోహిణి, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనూరాధ ఈ నక్షత్రాలు వచ్చిన రోజుల్లోనూ చీపురు కొనకూడదు



పాడైపోయిన చీపురు సోమవారం, బుధవారం, గురువారం, ఆదివారం మాత్రమే బయట పడవేయాలి



ఎవరైనా మరణించినప్పుడు ఆ భౌతికకాయం పెట్టిన చోట శుభ్రం చేసేందుకు ఉపయోగించిన చీపురు పడేయాలి



బిడ్డ పుట్టినప్పుడు పురిటి స్నానం తర్వాత రోజు నుంచి ఆ ఇంట్లో అప్పటివరకు ఉపయోగించిన చీపురు మళ్లీ వాడకూడదు



గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం.వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం



images credit: flipkart