మనకున్న అలవాట్లే మన కలిమికైనా లేమికైనా కారణమని గరుడ పురాణం చెబతోంది. గరుడ పురాణంలో అనుసరించాల్సిన కొన్ని నియమాల ప్రస్తావన కూడా ఉంది. వాటిని పాటించడం ద్వారా ఈపరిస్థితి నుంచి బయట పడవచ్చు.
ఎప్పుడూ సంపద చూసుకుని గర్వపడకూడదు. డబ్బున్న వాళ్లమని ఇతరులను ఎవరినీ అవమానించకూడదు, అగౌరవ పరచకూడదు. సంపద చూసుకుని గర్వపడే వారిపై కోపంతో లక్ష్మీ దేవి వెళ్లిపోతుంది. లక్ష్మీ అనుగ్రహం లేకుండా రూపాయి నిలవడం చాలా కష్టం.
ఇంట్లో తరచుగా రామాయణం, భారత, భాగవతాల వంటివి నిరంతరం పారాయణం చేస్తే ఆ ఇంట్లో ఆనందం, శాంతి వెల్లివిరిస్తాయి. ఇలాంటి గ్రంథ పఠనం ద్వారా నిరంతరం ఇంట్లో భగవన్నామ స్మరణ చేస్తుంటారు ఫలితంగా ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.
గరుడ పురాణం కూడా ఒకవ్యక్తి తన సామర్థ్యాన్ని బట్టి దానధర్మాలు చేయమని చెబుతోంది. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టించడం, అవసరం ఉన్న వారికి చేతి సాయం చెయ్యడం వంటి వాటి వల్ల పుణ్యం కలుగుతుంది. ఫలితంగా అనుకున్నవి సాధించగలుగుతారు.
గరుడ పురాణాన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ పితృదేవతలను ఆరాధించుకోవాలి. తెల్లవారు జామున నిద్ర లేచి స్నానాధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత పితృదేవతలు, దేవుళ్ళను పూజించాలని గరుడ పురాణం చెబుతోంది.
వంట గది అత్యంత పవిత్రమైన ప్రదేశం. వంటగదిలోకి ఉదయం స్నానం తర్వాతే వంట చేసేందుకు వెళ్లాలి. వంట గదిలో వండిన ప్రతి వంటకం భగవంతుడికి అర్పించిన తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీ ఆ ఇంటిని వదిలిపోదు.
ఇంట్లో వండిన ఆహారంలో మొదటి ముద్దను ఆవుకు, చివరి ముద్దను కుక్కకు పెట్టాలని గరుడ పురాణం చెబుతోంది. అందువల్ల లక్ష్మీ కటాక్షం మాత్రమే కాదు శని అనుగ్రహం కూడా లభిస్తుంది.
సంధ్యా సమయంలో ఇల్లు ఊడ్చ కూడదు. ఇల్లు శుభ్రం చెయ్యకుండా ఉదయం టిఫిన్ తినకూడదు. ఇల్లు శుభ్రం చెయ్యకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు.
సింహద్వారం దగ్గర చెప్పులు చిందరవందరగా వదలకూడదు. ఇంటి గడప లక్ష్మీతో సమానం కనుక పసుపు రాసి బొట్టు పెడితే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు