Chanakya Niti In Telugu : రాజకీయ నాయకుల డైలీ షెడ్యూల్ ఇలా ఉంటే మళ్లీ మళ్లీ గెలవడం ఖాయం!
Chanakya Niti :ఆదర్శవంతమైన పాలకుడు ఎలా ఉండాలి? ఏం నేర్చుకోవాలి? ఉత్తమ పాలకుడు అనిపించుకోవడం ఎలానో చెబుతూ ఎన్నో సూచనలు చేసిన ఆచార్య చాణక్యుడు..ఓ షెడ్యూల్ ఫిక్స్ చేశాడు...
Chanakya Niti In Telugu : పాలకులకు ఉండాల్సిన మంచి లక్షణాలేంటో స్పష్టంగా వివరించిన చాణక్యడు..తన రోజువారీ కార్యక్రమాలు ఎలా ఉండాలో వివరిస్తూ కొన్ని సూచనలు చేశాడు. పగలు, సాయంత్రం, రాత్రి...ఇలా రోజుని 8 పీరియడ్లుగా...ఒక్కో పీరియడ్ గంటన్నర ఉండేలా విభజించుకోవాలని సూచించాడు. మరి ఉదయం నుంచి రాత్రి వరకూ ఓ గంటరన్నరో ఏం చేయాలో కూడా స్పష్టంగా చెప్పాడు చాణక్యుడు...
Also Read: ఆదర్శ పాలకుడికి ఉండాల్సిన లక్షణాలివే - చాణక్య నీతి
సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి...
మొదటి గంటన్నర
వ్యాయామంపై దృష్టి సారించాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యవంతమైన పాలన అందివ్వగలరు. ఆ తర్వాత మత సంబంధిత విషయాలు, కుటుంబ క్షేమం కోసం అనుసరించాల్సిన విధులపై పండితులతో చర్చించాలి. అనారోగ్య సమస్యలేమైనా ఉంటే వ్యక్తిగత వైద్యుడితో సంప్రదింపులు.. ఆ రోజు భుజించాల్సిన పోషకాహారంపై వంటవారికి సూచనలు ఇవ్వడం చేయాలి.
రెండో గంటన్నర
రెండో గంటన్న పీరియడ్ లో రక్షణ, రాబడి , ఖర్చులకు సంబంధించిన నివేదికలన్నీ పరిశీలించాలి.. అందులో లోటుపాట్లను సరిగ్గా గమనించాలి
మూడో గంటన్నర
మూడో గంటన్నర అంటే దాదాపు ఉదయం 8 గంటల నుంచి తొమ్మిదిన్నర సమయం...పూర్తిగా ప్రజలకు కేటాయించాలి. ఆ గంటన్నపాటూ ప్రజా సమస్యలు ఓపికగా వినడం, నివేదికలు స్వీకరించడం చేయాలి. అప్పటికప్పుడు పరిష్కరించగలిగే సమస్యలుంటే వెంటనే పూర్తిచేసేయడమే మంచిది.
నాలుగో గంటన్నర
వ్యక్తిగత కార్యక్రమాలు ( స్నానం- పూజ-ఆహారం)
Also Read: ప్రజలకు ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడడానికి కారణాలివే - చాణక్య నీతి !
మధ్యాహ్న విరామం
ఐదో గంటన్నర
మంత్రులతో , ఉన్నతాధికారులతో , తన దగ్గరుండే అధికారులతో చర్చించడం...వారు చెప్పేది జాగ్రత్తగా విని, ప్రజలు ఆరోజు ఇచ్చిన నివేదికలపై చర్చించి...ఎవరి బాధ్యతలు వాళ్లకి అప్పగించడంతో పాటూ ప్రజలు ఇచ్చే నివేదికలను ఏ రోజుకారోజు పరిష్కరించేలా ఆదేశాలు జారీచేయాలి
సాయంత్రం
ఆరో గంటన్నర
వివిధ శాఖల నుంచి అయినా, వివిధ వ్యక్తుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి ఆ బాధ్యతలు పూర్తిచేయడం. కేటాయింపులు వివరాలు గురించి సంబంధిత అధికారులతో చర్చించి తగిన పరిష్కారాలు చూడడం
ఏడో గంటన్నర - వ్యక్తిగతం
స్నానం - భోజనం- విజ్ఞానాన్నిచ్చే పుస్తకాలు చదువుకోవడం
Also Read: రోజుని ఇలా ప్లాన్ చేసుకోండి.. మీ ఎదుగుదలని ఎవరు ఆపుతారో చూద్దాం - చాణక్య నీతి!
ఎనిమిదో గంటన్నర
కుటుంబానికి సమయం కేటాయించడం
అనంతరం నిద్ర....సూర్యోదయానికి ముందే మేల్కొనడం..
ప్రతి పాలకుడు ఇదే షెడ్యూల్ తప్పనిసరిగా అనుసరించాలని లేదు..ఎవరి పరిస్థితులను బట్టి , అవకాశం ఆధారంగా కొన్ని మార్పులు చేసుకోవచ్చుని ఆచార్య చాణక్యుడు అర్థశాస్త్రంలో చెప్పాడు...అయితే ఈ ప్రణాళికను పాటించినవారు ఆదర్శ పాలకుడు అవుతారని స్పష్టం చేశాడు. అయితే ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నప్పుడే పాలకులకు మంచి జరుగుతుంది...పోటీ వాతావరణం తగ్గుతుంది. అందుకే పాలకుల ఆలోచన ఎప్పుడూ ప్రజలకు ఏం చేస్తే మంచిది అనే దిశగానే ఉండాలని చాణక్యుడు పదే పదే ఇదే విషయాన్ని అర్థశాస్త్రంలో ప్రస్తావించాడు. అన్నిటి కన్నా ముఖ్యమైనది పాలకులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులోనే ఉండాలి..వారి సమస్యలు విని పరిష్కారం దిశగా ఆలోచన చేయాలి..వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలి. అలా చేయని పాలకులపై ప్రజానుగ్రహం ఎప్పటికీ ఉండదు...ఇలాంటి సమయంలోనే పాలకులు తమకు తెలియకుండానే ప్రత్యర్థుల బలం పెంచినవారవుతారు. ప్రజలకు సేవ చేసి, వారి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే మంచి నాయకులు, పాలకుడు అనిపించుకుంటారు...ఇలాంటివారికి ఓటమి ఎప్పటికీ ఉండదు..మళ్లీ మళ్లీ గెలుపు తథ్యం....
Also Read: సింహాద్రి అప్పన్న చందనోత్సవం గురించి ఈ విషయాలు తెలుసా!