అన్వేషించండి

AP Delimitation Politics: చంద్రబాబు లేఖ వ్యూహం - జగన్‌ను ఇరికించిన డీలిమిటేషన్ చదరంగం - ఇప్పుడేం చేస్తారు?

Chandrababu Naidu: ఏపీ డిలిమిటేషన్ పాలిటిక్స్ లో చంద్రబాబు వ్యూహాత్మకమైన అడుగు వేశారు. భవిష్యత్ జగన్ విమర్శలు చేయకుండా ఆయన కూడా మద్దతిచ్చినట్లుగా చేస్తున్నారు.

AP Delimitation Politics babu plan on jagan: మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి సున్నితమైన అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాటిస్తున్న వ్యూహం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన రాసిన లేఖ కేవలం ఒక అధికారిక సమాచారం మాత్రమే కాదు, దాని వెనుక లోతైన రాజకీయ చదరంగం ఉంది. 

చంద్రబాబు టైమింగ్ లో వ్యూహం

రాజకీయాల్లో టైమింగ్ ఎంత ముఖ్యమో, ప్రత్యర్థిని తన దారికి తెచ్చుకోవడంలో వ్యూహం అంతకంటే ముఖ్యం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డికి రాసిన లేఖ ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై మద్దతు కోరుతూ రాసిన ఈ లేఖ ద్వారా బాబు.. జగన్‌ను ఒక రకమైన రాజకీయ  వ్యూహంలో బిగించారనే వాదన రాజకీయ విశ్లేషకుల్లో బలంగా వినిపిస్తోంది.

సమ్మతించినా.. వ్యతిరేకించినా బాబుదే పైచేయి! 

చంద్రబాబు లేఖ రాయడంలో ప్రధాన ఉద్దేశం జగన్‌ను డిఫెన్స్‌లోకి నెట్టడమే. ఒకవేళ జగన్ ఈ బిల్లులకు మద్దతు ఇస్తే, చంద్రబాబు కోరినందుకే తలొగ్గారనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది.  అధికార పక్షం తీసుకున్న చొరవకు ప్రతిపక్షం తోడైందనే క్రెడిట్ బాబు ఖాతాలోకి చేరుతుంది. సాధారణంగా కేంద్రం తీసుకువచ్చే ఏ బిల్లునైనా  సమర్థించే జగన్, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ బిల్లును వ్యతిరేకిస్తే.. ఆయన తన గత రాజకీయ విధానాన్ని మార్చుకున్నట్లే అవుతుంది. ఒకవేళ వ్యతిరేకిస్తే, దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై ఆయనకు చిత్తశుద్ధి లేదనే విమర్శను మోయాల్సి ఉంటుంది.

దక్షిణాది సెంటిమెంట్‌తో ముడిపెట్టిన వైనం 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయనే ఆందోళన ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే దీనిపై గళమెత్తారు. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు అడుగులు వేశారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బిల్లుకు చంద్రబాబు మద్దతిస్తారు. జగన్ సైలెంట్ గా ఉన్నా.. భవిష్యత్ దక్షిణాదికి అన్యాయం అనే వాదన జగన్ వినిపిచకుండా ఉండటానికి ఈ లేఖ రాశారు.   జగన్ మద్దతు ఇస్తే ఆయన కూడా మద్దతిచ్చారని చెప్పవచ్చు. సైలెంట్ గా ఉన్నా అదే వాదన వినిపిస్తోంది. ఒక వేళ జగన్ మద్దతివ్వకపోతే.. బీజేపీకి వ్యతిరేకంగా యుద్ధం చేయాల్సిందే. టీడీపీకి కావాల్సింది కూడా అదే.

 రాజకీయ ఏకాభిప్రాయం.. బాబు మార్క్ డీలింగ్ 

సాధారణంగా ఇలాంటి బిల్లుల విషయంలో ఏకాభిప్రాయం కోసం అందరికీ లేఖలు రాస్తారు. కానీ జగన్ విషయంలో బాబు ప్రత్యేక శ్రద్ధ చూపడం వెనుక అసలు రాజకీయం ఉంది. జగన్ అటు కేంద్రానికి ఎదురు వెళ్లలేరు, ఇటు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బాబు చేసే వాదనను కాదనలేరు. ఈ రెండు వైపులా పదునున్న కత్తి లాంటి పరిస్థితిలో జగన్‌ను నిలబెట్టడంలో బాబు సక్సెస్ అయ్యారు.  

తప్పనిసరి మద్దతు.. తప్పించుకోలేని ఇరకాటం 

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరుపుతున్న జగన్, డీలిమిటేషన్ వంటి సెన్సిటివ్ బిల్లును వ్యతిరేకించే సాహసం చేయరని అందరికీ తెలిసిందే. అయితే, ఆ మద్దతును బాబు విజ్ఞప్తితో ముడిపెట్టడం ద్వారా జగన్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటును చంద్రబాబు లేకుండా చేశారు.   

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
జాబ్ సెక్యూరిటీ, EMI కంటే వైద్య ఖర్చులతోనే ఉద్యోగుల్లో టెన్షన్: తాజా అధ్యయనంలో వెల్లడి
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
Embed widget