అన్వేషించండి

Weekly Top Headlines: కర్ణాటక ఎన్నికల నుంచి రూ. 2000 నోట్ల రద్దు వరకు మే 14 నుంచి మే 20 వరకు వరకు ఉన్న వీక్లీ టాప్‌ హెడ్‌లైన్స్

Weekly Top Headlines: ఏప్రిల్‌ 30 నుంచి మే 6 వ తేదీ వరకు ఉన్న వీక్లీ టాప్‌ హెడ్‌లైన్స్

ప్రతీకాత్మక చిత్రం

1/10
భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ తన నిర్ణయం ప్రకటించింది. అయితే రూ.2వేల నోట్లను సెప్టెంబర్ 30వ తేదీ వరకు మార్చుకునేందుకు ఆర్బీఐ వెసలుబాటు కల్పించింది. రూ. 2000 నోటు చెలామణి కాకుండా ఉపసంహరించుకుంది. ఇకనుంచి రూ.2 వేల నోట్లను జారీ చేయకూడదని, వినియోగదారులకు ఇవ్వకూడదని బ్యాంకులకు సూచిస్తూ ఓ ప్రకటనలో పేర్కొంది.

2/10
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. 135 సీట్లలో విజయం సాధించింది. గత ఎన్నికల్లో 105 సీట్లు సాధించిన బీజేపీ కేవలం 65 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎవర్ని ఎంపిక చేయాలనే అంశంపై తీవ్రంగా చర్చలు జరిపింది. చివరకు సిద్దరామయ్యను ఎంచుకుంది. ఆయన ఇవాళ(మే 20న) ప్రమాణం చేయనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్, మరికొందరు మంత్రులు ప్రమాణం చేయనున్నారు.

3/10
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఆదిలాబాద్ నుంచి అనంతపురం వరకు జనం బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఒకనొక దశలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైనట్టు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. పదుల సంఖ్యలో జనం వడదెబ్బతో మృతి చెందారు. పశుపక్షాదులు కూడా ఎండకు విలవిలాడిపోయాయి. దీనికి తోడు ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాల రాక కూడా ఆలస్యమవుతుందని వాతావరణాధికారులు అంచనా వేస్తున్నారు

4/10
అమరావతిలోని ఆర్ 5 జోన్‌లో సెంటు స్థలాల పంపిణీకి ఏపీ ప్రభుత్వానికి అడ్డంకులు తొలగిపోయాయి. ప్రభుత్వం చేస్తున్న పట్టాల పంపిణీ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అంశంపై విచారణలో ఉన్న పిటిషన్లపై వచ్చే తీర్పుకు లోబడి  పట్టాల పంపిణీ ఉంటుందని స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘించి ఆర్ 5 జోన్  ను ఏర్పాటు చేసి సెంటు పట్టాలను పంపిణీ చేస్తున్నారని అమరావతి రైతులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో తాము పేదలకు పట్టాలు పంపిణీ చేసేశామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వాదనల తర్వాత సెంటు స్థలాల పంపిణీ విషయంలో జోక్యం  చేసుకోబోమన్న  సుప్రీంకోర్టు....  భూయాజమాన్య హక్కులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.

5/10
చుక్కల భూములకు విముక్తి సభలో పాల్గొనేందుకు సీఎం జగన్ నెల్లూరు జిల్లా కావలి వెళ్లారు. ఈ సందర్బంగా బీజేపీ కార్యకర్తలు సీఎం కాన్వాయ్‌ను అడ్డుకుంటారన్న ఉద్దేశంతో లాఠీచార్జ్ చేశారు. ఓ లీడర్‌ను రెండు కాళ్ల మధ్య నొక్కి పెట్టి ఉంచడం వివాదానికి దారి తీసింది. ప్రజాస్వామ్య విలువలను పోలీసు బూట్లు తొక్కేస్తున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఈ ఘటనపై అన్ని రాజకీయ పార్టీలు ఘాటుగా స్పందించాయి. బీజేపీ లీడర్లు డీజీపీకి ఫిర్యాదు చేశాయి.

6/10
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత‌న మే 18 గురువారం జరిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారిని మరింత ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేబినెట్ కమిటీ ఏర్పాటు చేశారు. వారికి ఆర్థిక సాయం చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధపడింది. 111 జీవోను పూర్తిగా ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

7/10
ఖమ్మంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల రోజున ప్రారంభించాలనుకున్న ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విగ్రహం ఏర్పాటు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో మొత్తం  14 పిటిషన్స్ దాఖలయ్యాయి.

8/10
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది లేకుండా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.  నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కిట్ల పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది.  అందులో భాగంగా దీర్ఘ కాలిక వ్యాధులైన బీపీ, షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇంటి వద్దకే మందులు అందించనున్నారు.  శుక్రవారం నుంచే హైదరాబాద్ జిల్లాలో ఈ విధానం అమల్లోకి వచ్చింది. రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి ఆశా వర్కర్లు ఎన్‌సీడీ కిట్స్‌ను పంపిణీ చేయటం ప్రారంభించారు. ఈ విధానం ద్వారా దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి ప్రభుత్వం నుంచి ఉపశమనం లభిస్తోంది. షుగరు..బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడుతున్న వారికి ఈ కిట్లు పంపిణీ కొనసాగుతోంది

9/10
గత కొన్నాళ్లుగా గాయాలతో సతమతమవుతున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్  ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు కీలక ప్రకటన చేశాడు. గాయాల కారణంగా  ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ నుంచి  తప్పుకుంటున్నట్టు నాదల్ తెలిపాడు. ఎర్రమట్టి కోర్టుగా పిలిచే ఫ్రెంచ్ ఓపెన్‌లో తన అరంగేట్రం (2005) నుంచి 2022 సీజన్ వరకూ నిరంతరాయంగా ఆడిన నాదల్.. 18 ఏండ్లలో ఏకంగా 14 ట్రోఫీలు గెలిచాడు. నాదల్ తన కెరీర్ లో  మొత్తం 22 గ్రాండ్ స్లామ్స్ నెగ్గితే అందులో  అగ్రభాగం (14) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్సే కావడం గమనార్హం.

10/10
తెలుగు సినిమా పరిశ్రమ గొప్పతనాన్ని వివరిస్తూ గోల్డెన్ గ్లోబ్ పోర్టల్ ప్రత్యేక సంపాదకీయాన్ని రాసింది. తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్థానాన్ని అందులో పొందుపరిచింది. తెలుగు సినిమాల గురించి ప్రస్తావించడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర ఆయా చిత్రాలు నెలకొల్పిన  రికార్డుల గురించి వివరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాలో తెలుగు సినిమా పరిశ్రమ అగ్రస్థానంలో కొనసాగుతుందంటూ ప్రశంసలు కురిపించింది. గత ఏడాది తెలుగు సినిమా పరిశ్రమ 212 మిలియన్ డాలర్లు(భారతీయ కరెన్సీలో రూ. 1754 కోట్లు సాధించినట్లు వెల్లడించింది. ఇండియా సినిమా అంటే తమదే అని చెప్పుకునే బాలీవుడ్ మాత్రం రూ. 179 మిలియన్ డాలర్లు(భారతీయర కెన్సీలో  రూ. 1630) కోట్లు మాత్రమే సాధించినట్లు రాసుకొచ్చింది.

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Hero Splendor Mileage: హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
హీరో స్ప్లెండర్‌లో ఏ మోడల్ ఎంత మైలేజీని ఇస్తుంది? - దేన్ని కొనుగోలు చేస్తే బెస్ట్?
Embed widget