అన్వేషించండి
Nomophobia : మొబైల్ పడుతుంటే ఆందోళనగా, టెన్షన్‌గా ఉందా? అయితే మీకు ఆ ఫోబియా ఉన్నట్లే, జాగ్రత్త
Anxiety Disorder with Mobile Addiction : మొబైల్ మన జీవితంలో భాగం. అది దూరమైతే ఆందోళన, ఇతర ఇబ్బందులు పడుతుంటే మీరు మానసిక ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లేనని జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు నిపుణులు.
మొబైల్తో మానసిక ఆందోళన
1/7

ఫోన్ గురించి అనవసరంగా ఆందోళన పడుతూ.. కిందపడితే పగిలిపోతుందని భయపడతున్నారా? అయితే అది ఏమాత్రం నార్మల్ కాదని.. అదొక మానసిక ఆందోళన కావొచ్చని అంటున్నారు. అది నోమోఫోబియా కావొచ్చు అంటున్నారు.
2/7

నామోఫోబియా అనేది ఒక కొత్త మానసిక సమస్య. ఇది ముఖ్యంగా యువతలో వేగంగా పెరుగుతోందట. ఈ సమస్య ఉండేవారికి మొబైల్ విరిగిపోయినా లేదా పూర్తిగా పోవడం వల్ల తన ప్రపంచం మొత్తం ముగిసిపోయినట్లు భావిస్తారట.
3/7

ఆ సమయంలో గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, చేతులు వణకడం, ఆందోళన వంటి లక్షణాలు కనిపిస్తాయట. మెదడుకు ప్రమాదం ఉందని అనిపించినప్పుడు శరీరం ఇలా ప్రతిస్పందిస్తుందట.
4/7

ఈ సమస్య పదే పదే వస్తుంటే మొబైల్‌పై మీరు బాగా ఆధారపడ్డారనేదానికి సంకేతం అంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు. ఈ ఆందోళనను స్పష్టమైన సంకేతంగా చెప్తున్నారు.
5/7

ఈ మానసిక సమస్యను నివారించడానికి అత్యంత ముఖ్యమైనది డిజిటల్ డిటాక్స్. అంటే మొబైల్ వినియోగాన్ని తగ్గించడం. సమయానుసారం సాంకేతికతకు దూరంగా ఉండడం చేయాలంటున్నారు.
6/7

యోగా, ధ్యానంతో కూడిన దినచర్యను పాటించాలని సూచిస్తున్నారు. ఇది ఆందోళన, భయాన్ని తగ్గించి.. ఫోన్ వాడకాన్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.
7/7

మొబైల్ పడిపోయినప్పుడు గాడ్జెట్ విరిగిపోతుందనే భయం, ఆందోళన ఉంటే.. ఇది మీ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన హెచ్చరిక కావచ్చు. అటువంటి పరిస్థితిలో నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.
Published at : 08 Sep 2025 05:26 PM (IST)
View More
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















