అన్వేషించండి
Suryapet Junction Movie: మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జంక్షన్... మధ్య తరగతి ప్రజల సమస్యలే ఎజెండా
'కొత్తగా మా ప్రయాణం' సినిమాలో హీరోగా నటించిన ఈశ్వర్ చేసిన కొత్త సినిమా 'సూర్యాపేట్ జంక్షన్'. లేటెస్టుగా సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా కథ గురించి, కథాంశం గురించి సినిమా యూనిట్ ఏం చెప్పిందంటే?

ఈశ్వర్, నైనా సర్వర్
1/5

'కొత్తగా మా ప్రయాణం' సినిమాలో హీరోగా నటించిన నటుడు ఈశ్వర్. ఆయన కథానాయకుడిగా రూపొందిన కొత్త సినిమా 'సూర్యాపేట్ జంక్షన్'. ఇందులో నైనా సర్వర్ హీరోయిన్. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకం మీద అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించారు. లేటెస్టుగా సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
2/5

'సూర్యాపేట్ జంక్షన్' ట్రైలర్ విడుదల సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ... ''మా సినిమాకు నేనే కథ రాశా. సూర్యాపేట పరిసరాల్లో జరిగే కథ జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఉచితంగా వచ్చే పథకాలు తీసుకోవడం వల్ల మధ్యతరగతి ప్రజలు ఎటువంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నారో తెలిపే కథాంశం ఇది. కథ, సన్నివేశాలతో పాటు సినిమాలో యాక్షన్ సీన్లు కూడా సహజంగా ఉంటాయి. మా దర్శకుడు రాజేశ్ గారు సినిమాను చాలా బాగా తెరకెక్కించారు'' అని చెప్పారు.
3/5

'సూర్యాపేట్ జంక్షన్' హీరోయిన్ నైనా మాట్లాడుతూ... ''సినిమాలో నేను జ్యోతి అనే అమ్మాయి పాత్రలో నటించాను. యువతకు నచ్చే చిత్రమిది. నాకు ఇందులో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు.
4/5

నిర్మాత అనిల్ కుమార్ కాట్రగడ్డ మాట్లాడుతూ... ''నాకు ఈ సినిమా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఇచ్చిన హీరో ఈశ్వర్ గారికి థాంక్స్. ఇందులో 'గబ్బర్ సింగ్' ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్ రోల్ చేశారు. 'చమ్మక్' చంద్ర, భాషా, లక్ష్మణ్, సంజయ్ ('బలగం' ఫేమ్), హరీష్ ఇతర పాత్రలు చేశారు. రోషన్ సాలూరి, గౌర హరి మంచి మ్యూజిక్ ఇచ్చారు. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అతి త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం'' అని చెప్పారు.
5/5

ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'సూర్యాపేట్ జంక్షన్' సినిమాకు కూర్పు: ఎం.ఆర్ వర్మ, కథ: ఈశ్వర్, రచయితలు: సత్య - రాజేంద్ర భరద్వాజ్, ఛాయాగ్రహణం: అరుణ్ ప్రసాద్, సాహిత్యం: ఎ. రహమాన్, సంగీతం: రోషన్ సాలూరి - గౌర హరి, నిర్మాణ సంస్థ: యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్, నిర్మాతలు: అనిల్ కుమార్ కాట్రగడ్డ - ఎన్.ఎస్ రావు, దర్శకుడు: నాదెండ్ల రాజేష్.
Published at : 01 Feb 2025 04:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion