Viral New: లగ్జరీలో గాలి జనార్దన్ రెడ్డి బాబు ఈ మధ్యప్రదేశ్ కాంట్రాక్టర్ - బంగళా అంతా బంగారమే - హోంటూర్ వైరల్ !
Indore Golden House: మధ్యప్రదేశ్ లోని ఓ కాంట్రాక్టర్ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి కారణం ఆ ఇల్లంతా బంగారం మయం కావడమే.

Indore Stunning Gold Themed Mansion: మైనింగ్ డాన్ గాలి జనార్ధన్ రెడ్డి తన ఇంట్లో ఓ బంగారు సింహాసనాన్ని చేయించుకున్నారని సీబీై బయటకు తెలిసేలా చేస్తే దేశం అంతా ఆశ్చర్యపోయింది. కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని ఓ ఇండోర్ కాంట్రాక్టర్ ఇంట్లో ఉన్న బంగారాన్ని చూస్తే.. గాలి జనార్ధన్ రెడ్డి లగ్జరీ ఓ పీపీలికం అనుకోవచ్చు.
మధ్యప్రదేశ్‌లో హోమ్ టూర్లు చేయడంలో ఫేమస్ అయిన కంటెంట్ క్రియేటర్ ప్రియమ్ సరస్వత్ ఇండోర్‌లో ఉన్న ఒక ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో ఫర్నిచర్ నుండి ఎలక్ట్రికల్ సాకెట్ల వరకు ప్రతిదీ స్వచ్ఛమైన బంగారంతో మెరుస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
"पापा यह रील बनाता है एक-एक करोड़ लोग देखते हैं।"
— Mukesh Mathur (@mukesh1275) June 30, 2025
बस फिर क्या था ‘करोड़पति रीलर’ ने सरकारी ठेकेदार जी का इंदौर का करोड़ों का घर दिखाया जिसमें बिजली के स्विच और हाथ धोने का सिंक भी सोने का बना था।
सुनहरी कहानी आप भी देखिए।#Indore pic.twitter.com/U3aNVxCs4I
ఇంటి యజమానుల అనుమతితో సరస్వత్ హోమ్ టూర్ చేశారు. 1936 వింటేజ్ మెర్సిడెస్‌తో సహా విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. విలాసవంతమైన అలంకరణ, స్థిరమైన బంగారు థీమ్ ఇంటి నిండా ఉంది. 24 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన విద్యుత్ స్విచ్ ల వరకూ అంతే ఉంది.
A government contractor from Indore built a house like a palace, almost 90 percent of his furniture is made of 24 carat gold, on the other hand people living with collapsing and unplanned infrastructure in Country says a lot about level of corruption in our country 😞. pic.twitter.com/u9vOeCKzuh
— Dt.Shareha Ansari (MSc CND;CDE). (@Dt_Shareha2801) June 30, 2025
ఈ భవనంలో పది బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. ఆవరణలో గోశాల కూడా ఉంది. ఆ ఇంటి యజమాని ప్రభుత్వ కాంట్రాక్టర్. 25 మంది ఉన్న వారి కుటుంబానికి ఒకే ఒక పెట్రోల్ పంపు ఉండేది. అయితే తర్వాత ప్రభుత్వ కాంట్రాక్టర్ గా మారారు. రోడ్లు, వంతెనలు, భవనాలను నిర్మించారు. ఇప్పుడు 300 గదుల హోటల్‌ను నిర్మిస్తున్నారు.
He’s a Govt Contractor in Madhya Pradesh. He built a Luxurious Bungalow where OG 24-carat Gold was used for decoration, he was from a humble background initially
— 𝗩eena Jain (@DrJain21) June 30, 2025
And he has done NO CORRUPTION. How to Believe? He has a Gaushala in his Bungalow 😇
pic.twitter.com/akfxZrYmzD
హోమ్ టూర్ చేయించి ఈ కాంట్రాక్టర్ మంచి పని చేశారు. లేకపోతే రేపు ఎప్పుడైనా దర్యాప్తు సంస్థలు రెయిడ్ చేస్తే.. ఇంట్లో ఉన్న బంగారం గురించి కథలు కథలుగా ప్రచారం జరిగేది. ఇప్పుడు ఆ కాంట్రాక్టరే బయట పెట్టుకున్నారు కాబట్టి... అంతా లీగలేనని వాదించడానికి అవకాశం ఏర్పడుతుంది.





















