US military base: 80 దేశాల్లో అమెరికా మిలటరీ బేస్‌లు - కానీ ఇండియాలో నో చాన్స్ -ఎందుకో తెలుసా ?
America: ప్రపంచవ్యాప్తంగా తమ మిలటరీ బేస్‌లు పెట్టుకోవాలని అమెరికా కోరిక. ఇప్పటి వరకూ 80 దేశాల్లో పెట్టింది. కానీ ఇండియాలో మాత్రం అడుగు పెట్టలేకపోయింది.

America military base: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచ పెద్దన్నగా పేరు తెచ్చుకుంది. దానికి తగ్గట్లుగానే ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలలో 750 కంటే ఎక్కువ సైనిక స్థావరాలను నిర్వహిస్తోంది. కానీ భారతదేశంలో ఒక్క అమెరికన్ సైనిక స్థావరం కూడా లేదు. దీనికి కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన గడ్డపై నుంచి అమెరికా సైనిక కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకపోవడమే.
భారతదేశం తన వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని గట్టిగా కాపాడుకుంటుంది. ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండి, ఒక శక్తివంతమైన సైన్యం, అణు ఆయుధాలు, అధునాతన నావికా దళం, అంతరిక్ష ,సైబర్ యుద్ధం చేయగలగిన సామర్థ్యాలను భార్త కలిగి ఉంది. ఈ స్వయం-సమృద్ధి భారతదేశాన్ని విదేశీ సైనిక స్థావరాల అవసరం లేకుండా చేస్తోంది.
భారతదేశం తన భూభాగంపై విదేశీ సైనిక స్థావరాలను అనుమతించడం వల్ల ఇతర దేశాలకు వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది. ఖతార్‌లోని అల్ ఉదేద్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడులు జరిగాయి. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అమెరికా ఇరాన్ పై దాడి చేయడంతో ప్రతీకారంగా ఈ దాడి చేశారు. అమెరికా సైనిక స్థావరం ఉండవల్ల వల్ల ఖతార్ లక్ష్యంగా మారింది. భారతదేశం ఇలాంటి రిస్క్‌లను నివారించడానికి విదేశీ స్థావరాలను అనుమతించదు.
🇶🇦 Al Udeid Air Base — Qatar
— Kuch New For You (@kuchnewforyou) June 23, 2025
Home to 10,000 U.S. troops, it’s the largest American military base in the Middle East.
Iran is going to hit this American Base#iran #IranIsraelConflict #America #IsraelIranConflict #IsraeliranWar pic.twitter.com/mylRYdl91N
అదే సమయంలో భారతదేశం తన సైనిక స్థావరాలను విదేశాలలో స్థాపిం చడంలో సంయమనం పాటిస్తుంది. చాలా పరిమితంగానే ఇతర దేశాల్లో భారత సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇవి కూడా సహకారం , సమ్మతి ఆధారంగా నడుస్తాయి, ఆధిపత్యం కోసం కాదు. ఒమన్‌లోని రాస్ అల్ హద్‌లో లిజనింగ్ పోస్ట్, డుఖ్‌లో లాజిస్టిక్స్ హబ్, అలాగే సింగపూర్‌లోని చాంగి నావల్ బేస్‌కు యాక్సెస్ ఉన్నాయి, ఇవి భారతదేశ వ్యూహాత్మక అవసరాలను తీరుస్తాయి.
అమెరికాతో భారత్ సంయుక్త సైనిక విన్యాసాలు మ, లాజిస్టిక్స్ ఒప్పందాలు ఉన్నాయి. 1947 నుండి, భారతదేశం తన విదేశాంగ విధానంలో స్వాతంత్ర్యాన్ని ఒక సూత్రంగా కాపాడుతోంది. ఇది ఏ శక్తివంతమైన దేశంతోనూ పూర్తి ఆధీనంలోకి వెళ్లకుండా, సమతుల్య సంబంధాలను నిర్వహిస్తుంది. ఈ విధానం భారతదేశాన్ని అమెరికా, ఇతర దేశాల సైనిక స్థావరాలను తన భూమిపై అనుమతించకుండా చేసింది.





















