Top Headlines Today: తెలంగాణలో ఆరుగురు కొత్త మంత్రులు ఎవరో!; ఏపీ ప్రభుత్వం ఆ నిధులేం చేసింది? - నేటి టాప్ న్యూస్
AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
ఆరుగురు మంత్రులు ఎవరో!
తెలంగాణలో శాసన సభ ఎన్నికలు ముగిసి దాదాపు ఆరు నెలలు కావోస్తోంది. 11 మంది మంత్రులు, ముఖ్యమంత్రి కలుపుకుంటే 12 మందితో పాలన సాగుతోంది. అసెంబ్లీ స్థానాలను బట్టి రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి సహా 18 మందికి చోటు దక్కుతుంది. ప్రస్తుతం 12 మందికి అవకాశం దక్కగా, మిగతా ఆరుగురు మంత్రులు ఎవరన్న ఆసక్తి తెలంగాణ వ్యాప్తంగా నెలకొంది. పార్లమెంట్ ఫలితాలు జూన్ నాలుగో తేదీన ప్రకటించనుండటంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమా, లేక ఇండియా కూటమినా అనేది తేలిపోనుంది. ఇంకా చదవండి
ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేశారు. నగరంలోని అశోక్‌నగర్‌లో ఉన్న ఆయన ఇళ్లు, కూతురి ఇల్లు, సంబంధించిన మరో రెండు ఇళ్లు, సీసీఎస్ ఆఫీసు, సన్నిహితుల ఇళ్లలో, ఆంధ్రప్రదేశ్‌లో రెండు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు మంగళవారం (మే 21న) సోదాలు నిర్వహించారు. అనంతరం సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేసిన జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర బాబు మీడియాకు వెల్లడించారు. ఇంకా చదవండి
ఏపీ ప్రభుత్వం నిధులేం చేసింది?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాల లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పదో తేదీన హైకోర్టు ఇచ్చినపర్మిషన్‌తో రూ. 14 వేల కోట్లను గత ఐదు నెలల నుంచి బటన్లు నొక్కినప్పటికీ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయని నిధులను జమ చేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు. పదమూడో తేదీన పోలింగ్ ముగిసిన వెంటనే ఆ నిధులను లబ్దిదారుల ఖాతాల్లో వేయవచ్చని ఈసీ అనుమతి ఇచ్చింది. కానీ వారంరోజులు పాటి పోయిన తర్వాత కూడా పది శాతం లబ్దిదారుల ఖాతాల్లో కూడా నగదు జమ చేయలేకపోయారు. అందుకే ఆ రూ. పధ్నాలుగు వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారని అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా చదవండి
EVM ధ్వంసం ఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు
ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.మే 13న ఎన్నికల రోజు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓ ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. అక్కడున్న వారిని బెదిరించి వెళ్లిపోవడం సీసీటీవీ ఫుటేజీలో చూడవచ్చు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా చదవండి
బీజేపీ గెలిచినా స్టాక్ మార్కెట్లు కుప్పకూలతాయ్
దేశంలో ప్రస్తుతం అందరిచూపు ఎన్నికల ఫలితాలపైనే కొనసాగుతోంది. అసలు ఎన్నికలు ఇంకా పూర్తి కాకమునుపే స్టాక్ మార్కెట్లలో విన్నర్ గురించి భారీగా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధాని నుంచి ప్రశాంత్ కిషోర్ వరకు ఎవరి నోట్లో విన్నా ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల గురించే వినిపిస్తోంది. అందరూ బీజేపీ గెలిస్తే లేదా గెలవకపోతే పరిస్థితుల గురించి అంచనా వేస్తుండగా.. ప్రశాంత్ కిషోర్ లెక్క మరోలా ఉంది. ఆయన కామెంట్స్ ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఇంకా చదవండి
డీప్ ఫేక్ ఫోటోలను ఇలా గుర్తించండి
డీప్ ఫేక్... ప్రస్తుతం అందరికీ ఆందోళన కలిగిస్తోన్న అంశం. డీప్ ఫేక్ ఫోటోలు (Deepfake Photos), వీడియోలు ఎన్నో రంగాలకు ప్రస్తుతం ముప్పుగా పరిణమిస్తున్నాయి. ఇటీవల పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలకు సంబంధించి డీప్ ఫేక్ వీడియోలు (Deepfake Videos) కలకలం సృష్టించాయి. ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) మానవాళి సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి కాగా.. అంతే స్థాయిలో ప్రమాదకరంగానూ పరిణమించిందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా చదవండి
కక్కుర్తి పడితే మీ డబ్బు దొంగలపాలు
మారుతున్న సాంకేతికతతో పాటు బ్యాంకింగ్ విధానాల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. డిజిటల్ బ్యాంకింగ్ ఇప్పుడు ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అదే సమయంలో, సాంకేతికత వినియోగం వృద్ధితో పాటే బ్యాంకులకు సంబంధించిన డిజిటల్ మోసాలు కూడా విపరీతంగా పెరిగాయి. బ్యాంక్ పేరిట మోసాల కేసులు పెరుగుతున్న దృష్ట్యా, దేశంలోని చాలా పెద్ద బ్యాంకులు తమ కస్టమర్లకు హెచ్చరికలు పంపాయి. దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ (APK) ద్వారా SBI రివార్డ్ పాయింట్లను స్వీకరించాలన్న లింక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తన ఖాతాదార్లకు సూచించింది. ఇంకా చదవండి
అది రేవ్ పార్టీ కాదు, బర్త్‌డే పార్టీ - ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి
బెంగళూరు రేవ్ పార్టీ ఇండస్ట్రీలో సంచలనం రేపుతుంది. ముఖ్యంగా ఈ సంఘటన టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారంటూ వార్తలు రావడంతో ఇది ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ మారింది. ఇందులో ప్రధానం నటి హేమ, శ్రీకాంత్‌ల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రేవ్ పార్టీలో తాను లేనంటూ నటి హేమ స్వయంగా వెల్లడించింది. ఇంకా చదవండి
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు చైతన్య కృష్ణ మాస్ వార్నింగ్
ఇతరులు తమ జోలికి వస్తే నందమూరి కుటుంబం తామంతా ఒకటేనని చాటుతుంది. కానీ ఎందుకో తెలియదు గానీ తెలుగుదేశం పార్టీ విషయం వచ్చే సరికి లెక్కలు మారిపోతాయి. జూనియర్ (NTR) అభిమానులందరికీ హెచ్చరిక అంటూ నందమూరి చైతన్య కృష్ణ పోస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే ఎవరో కూడా క్లియర్‌గా కాకపోయినా, వాళ్లు ఎవరో చెప్పకనే చెప్పారు. ఇంకా చదవండి
మెట్లపై కూర్చొని ఏడ్చేసిన త్రిపాఠి, ఎందుకంటే?
క్వాలిఫయర్ వన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను చిత్తు చేసిన కోల్‌కత్తా(KKR)... ఫైనల్లో అడుగుపెట్టింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తేలిపోయింది. హైదరాబాద్ ఓపెనర్లు ట్రానిస్ హెడ్, అభిషేక్ శర్మలు తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో.. క్వాలిఫయర్-1లో కనీస పోటీ అయినా ఇవ్వకుండానే కోల్‌కతాకు హైదరాబాద్ తలవంచింది. ఇంకా చదవండి
తేల్చుకోవాల్సిన సమయమిదే, నేడే ఎలిమినేటర్ మ్యాచ్
క్రికెట్ ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అద్భుత ప్రదర్శనతో... వరుసగా ఆరు విజయాలతో.. ప్లే ఆఫ్‌కు దూసుకొచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)... రాజస్థాన్ రాయల్స్(RR)తో నాకౌట్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు.. ఐపీఎల్(IPL) నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు అర్హత సాధిస్తుంది. సమవుజ్జీలుగా కనిపిస్తోన్న బెంగళూరు- హైదరాబాద్ జట్ల మధ్య పోరు హోరీహోరీగా సాగుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇంకా చదవండి