అన్వేషించండి

IPL 2024 Eliminator : తేల్చుకోవాల్సిన సమయమిదే, నేడే ఎలిమినేటర్‌ మ్యాచ్‌

IPL 2024 Eliminator, RCB vs RR: డూ ఆర్‌ డై మ్యాచ్‌లో భీకర్‌ ఫామ్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును.. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ఎంత వరకూ కట్టడి చేయగలదో చూడాలి.

IPL 2024: Eliminator, RR vs RCB Match Prediction: క్రికెట్‌ ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెట్టే మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అద్భుత ప్రదర్శనతో... వరుసగా ఆరు విజయాలతో.. ప్లే ఆఫ్‌కు దూసుకొచ్చిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB)... రాజస్థాన్‌ రాయల్స్‌(RR)తో నాకౌట్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు.. ఐపీఎల్‌(IPL) నుంచి నిష్క్రమిస్తుంది.  గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2కు అర్హత సాధిస్తుంది. సమవుజ్జీలుగా కనిపిస్తోన్న బెంగళూరు- హైదరాబాద్‌ జట్ల మధ్య పోరు హోరీహోరీగా సాగుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ డూ ఆర్‌ డై మ్యాచ్‌లో భీకర్‌ ఫామ్‌లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును.. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ఎంత వరకూ కట్టడి చేయగలదో చూడాలి. వరుసగా నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఒకవైపు... వరుసగా ఆరు విజయాలతో ప్లే ఆఫ్‌కు చేరిన బెంగళూరు మరో వైపు ఉండడంతో ఈ పోరు చివరి ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. తొలుత 
 
భిన్నంగా సాగిన ప్రయాణం
ఈ సీజన్‌లో బెంగళూరు ప్లే ఆఫ్‌కు చేరుతుందని ఎవరూ అంచనా వేయలేదు. కానీ బెంగళూరు అద్భుతంగా పోరాడింది. తొలి ఎనిమిది మ్యాచుల్లో ఒకే విజయం సాధించిన ఆర్సీబీ ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచుల్లో విజయం సాధించింది. చివరి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ప్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు రాజస్థాన్‌ ఆరంభంలో వరుసగా విజయాలు సాధించి ప్లే ఆఫ్‌కు చేరువైంది. కానీ ఆ తర్వాత వరుసగా పరాజయాలు చవిచూసి తొలి స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. గత నాలుగు మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్, బౌలింగ్‌ బలహీనతలను బహిర్గతం చేశాయి. జోస్ బట్లర్ స్వదేశానికి వెళ్లడం రాజస్థాన్‌ రాయల్స్‌ లయను దెబ్బ తీశాయి. యశస్వి జైస్వాల్ 348 పరుగులు, కెప్టెన్ శాంసన్ 504, రియాన్ పరాగ్ 531 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉండడం రాజస్థాన్‌కు కలిసి రానుంది. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా రాణించని హెట్‌మెయిర్ ఈ మ్యాచ్‌లో రాణిస్తాడని రాజస్థాన్‌ భావిస్తోంది. అహ్మదాబాద్‌ పిచ్‌పైనే ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండనుండడంతో ఇరు జట్ల బౌలర్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ సీజన్‌లో 12 ఇన్నింగ్స్‌లలో 200 పరుగుల మార్క్‌ను రెండుసార్లు మాత్రమే అధిగమించారు. కాబట్టి ఈ పిచ్‌పై క్రమశిక్షణతో బౌలింగ్‌ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 
 
భారమంతా విరాట్‌పైనే 
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటింగ్‌ భారమంతా విరాట్‌ కోహ్లీనే మోయనున్నాడు. అందుకే అందరి చూపు విరాట్‌పైనే ఉంది. ఈ సీజన్‌లో 14 మ్యాచుల్లో విరాట్‌ 708 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. RCB కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌ ప్లేయర్‌ విల్ జాక్స్ స్వదేశానికి వెళ్లినా అది RCBపై పెద్దగా ప్రభావం చూపలేదు. అనుభవజ్ఞుడైన దినేష్ కార్తీక్ 195 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ధాటిగా పరుగులు సాధిస్తున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ యష్ దయాల్ చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మరోసారి దయాల్‌ సహా బెంగళూరు బౌలర్లు చెలరేగితే రాజస్థాన్‌ను నిలువరించడం బెంగళూరుకు పెద్ద కష్టం కాకపోవచ్చు.
 
జట్లు:
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్‌), అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, కుల్దీప్ సేన్, కునాల్ సింగ్ రాథోడ్, నంద్రే బర్గర్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రాన్ హెట్మేర్, శుభమ్ డుబీ, శుభమ్ డుబీ పావెల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, తనుష్ కోటియన్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్ ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్ మరియు సౌరవ్ చౌహాన్.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget