అన్వేషించండి

బీజేపీ గెలిచినా స్టాక్ మార్కెట్లు కుప్పకూలతాయ్- ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్

Loksabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన సొంత లక్ష్యమైన 370 సీట్లను సాధించడంలో వైఫల్యం స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారుల నిరాశను చూపిస్తుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

Prashant Kishor: దేశంలో ప్రస్తుతం అందరిచూపు ఎన్నికల ఫలితాలపైనే కొనసాగుతోంది. అసలు ఎన్నికలు ఇంకా పూర్తి కాకమునుపే స్టాక్ మార్కెట్లలో విన్నర్ గురించి భారీగా  చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధాని నుంచి ప్రశాంత్ కిషోర్ వరకు ఎవరి నోట్లో విన్నా ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల గురించే వినిపిస్తోంది. అందరూ బీజేపీ గెలిస్తే లేదా గెలవకపోతే పరిస్థితుల గురించి అంచనా వేస్తుండగా.. ప్రశాంత్ కిషోర్ లెక్క మరోలా ఉంది. ఆయన కామెంట్స్ ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి.

370 సీట్లలో బీజేపీ గెలవకపోతే !
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తన సొంత టార్గెట్ అయిన 370 సీట్లలో గెలుపును సాధించడంలో విఫలమైతే అది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లోని పెట్టుబడిదారుల సెంటిమెంట్లను దెబ్బతీస్తుందని ప్రఖ్యాత పోల్ స్టాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. దీనిని కార్పొరేట్ కంపెనీల పనితీరుతో పోల్చుతూ.. ఏదైనా కంపెనీ తాను పేర్కొన్న లక్ష్యాలను అందుకోవటంలో విఫలమైతే స్టాక్ మార్కెట్లలో సదరు కంపెనీ షేర్లపై ఆ ప్రభావం ప్రతికూలంటూ ఉండే అవకాశం ఉందన్నారు. ఇదే విధంగా బీజేపీ తన టార్గెట్ 370 సీట్ల కంటే తక్కువ గెలిస్తే అది చర్చనీయాంశంగా మారి మార్కెట్ల పతనానికి దారితీయవచ్చని అన్నారు. ఎలక్షన్ ఫలితాలను మార్కెట్లు ప్రతిబింబిస్తాయని ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

మోదీ గెలుస్తాడా లేదా ఓడిపోతాడా అని కాదు 
ఏదేమైనా గత కొన్ని నెలలుగా అధికార పార్టీ 370 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందా అనే చర్చలు సాగుతున్నాయని, ఎన్నికల్లో మోదీ గెలుస్తాడా లేదా ఓడిపోతాడా అనే దానిపై కాదన్నారు ప్రశాంత్ కిషోర్. అయితే మరోపక్క ఇటీవల జరిగిన అన్ని బహిరంగ సమావేశాల్లోనూ దిగ్గజ బీజేపీ నేతలు తాము ఈ సారి ఎన్నికల్లో 400+ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఈసారి తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో తమ ఓట్ల శాతాన్ని పెంచుకునే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ 370 సీట్లు మాత్రం గెలిచే అవకాశాలు లేవని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పేశారు. చాలా కాలంగా మార్కెట్లోని అనలిస్టులు, రీసెర్చ్ సంస్థల అంచనాలు సైతం బీజేపీకి 300 కంటే తక్కువ స్థానాల్లో గెలుపొందనున్నట్లు అంచనా వేస్తున్నాయి.దీంతో ముందస్తుగా విదేశీ ఇన్వెస్టర్లు తమ డబ్బును మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

విపక్షాలకు బీజేపీ గెలుపును ఆపడానికి మూడు విభిన్నమైన, వాస్తవిక అవకాశాలు ఉన్నాయని.. అయితే వాటిని సోమరితనంతో పాటు తప్పుడు వ్యూహాలతో వదులుకున్నారని ఏప్రిలో ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. బీజేపీకి స్పష్టమైన ఆధిపత్యం ఉన్నప్పటికీ పార్టీ లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేవ్ లేదని పునరుద్ఘాటించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని పోల్ పొజిషన్ సాధించకుండా ఆపడానికి ప్రతిపక్షాలు కోల్పోయిన అవకాశాలను ఎత్తి చూపారు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 379 స్థానాలకు ఇప్పటివరకు పోలింగ్ పూర్తయింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Embed widget