అన్వేషించండి

Rishab Shetty: నాన్ వెజ్ తినలేదు... చెప్పులు వేసుకోలేదు - 'కాంతార చాప్టర్ 1' సీన్స్‌పై రిషభ్ శెట్టి రియాక్షన్

Kantara Chapter 1: 'కాంతార' ప్రీక్వెల్ షూటింగ్ సమయంలో కొన్ని సీన్స్ తీసేటప్పుడు నియమాలు పాటించినట్లు చెప్పారు కన్నడ స్టార్ రిషభ్ శెట్టి. ఇక్కడ ఎవరి నమ్మకాలు వారివి అంటూ చెప్పారు.

Rishab Shetty Reaction On Kantara Chapter 1: 'కాంతార'కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన 'కాంతార చాప్టర్ 1' విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్లలో బిజీగా మారింది. ఈ మూవీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు కన్నడ స్టార్ రిషభ్ శెట్టి.

నాన్ వెజ్ తినలేదు... చెప్పులు వేసుకోలేదు

మూవీ షూటింగ్ టైంలో చెప్పులు వేసకోవడం మానేశారా? నాన్ వెజ్ తినలేదా? అంటూ ఎదురైన ప్రశ్నకు రిషభ్ రియాక్ట్ అయ్యారు. కొన్ని సీన్స్ షూట్ చేసిన టైంలో అలా చేసినట్లు చెప్పారు. 'ఈ సినిమాలో దేవునికి సంబంధించి సీన్స్ షూట్ చేసిన టైంలో నేను నియమాలు పాటించాను. మాంసాహారం తీసుకోలేదు. చెప్పులు వేసుకోలేదు. నేను దేవున్ని బాగా నమ్ముతాను. అందుకే ఆ సీన్స్ తెరకెక్కించేటప్పుడు నాకు నేనే పరిమితులు విధించుకున్నా. ఎవరి నమ్మకం వారిది. నేను ఇతరుల నమ్మకాల గురించి మాట్లాడను. నాకు ఎలాంటి గందరగోళం ఉండకూడదు. నా మనస్సుకు ఏదైనా క్లారిటీగా ఉండాలి.' అంటూ చెప్పారు.

షూటింగ్ టైంలో ఈ సీన్స్ విషయంలో తక్కువ మందితోనే షూట్ చేసినట్లు వెల్లడించారు రిషభ్. 'సాధారణంగా షూట్ జరుగుతున్నప్పుడు సెట్‌లో వేలాది మంది ఉంటారు. ఈ సీన్స్ టైంలో అలా జరగలేదు. తక్కువ మందితోనే షెడ్యూల్ కంప్లీట్ చేశాం. నేను ఎవరి నమ్మకాన్ని కూడా ప్రశ్నించను. దానిని గౌరవిస్తాను. అవతలి వారి నుంచి కూడా అదే ఆశిస్తాను.' అంటూ చెప్పారు.

Also Read: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ @ 18 ఇయర్స్ ఇండస్ట్రీ - సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా చూసిన ఆ క్షణం... అంటూ మెగాస్టార్ ఎమోషనల్

ఆ వైరల్ పోస్టుపై...

ఇక 'కాంతార చాప్టర్ 1' చూసే ముందు నాన్ వెజ్ తినొద్దని, ఆచారాలు పాటించాలంటూ ఇటీవల ఓ ఫ్యాన్ మేడ్ పోస్ట్ వైరల్ అయ్యింది. దీనిపైనా స్పందించిన రిషభ్ శెట్టి... 'ఒకరి తినడం లేదా వ్యక్తిగత అలవాట్లను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి ఇష్టం వారిది. ఎవరో ఓ వ్యక్తి నకిలీ పోస్ట్ అప్ లోడ్ చేశారు. అది మా దృష్టికి వచ్చింది. వారు వెంటనే దాన్ని తొలగించి సారీ చెప్పారు.' అని క్లారిటీ ఇచ్చారు.

'కాంతార చాప్టర్ 1'లో కొన్ని సీన్స్ ఎప్పటికీ మర్చిపోలేరని... ముఖ్యంగా ఒక సీన్ ఆడియన్స్‌కు జీవితాంతం గుర్తుంటుందని చెప్పారు రిషభ్. ఇండస్ట్రీలో ఉన్న వారికి తనను చూసిన ప్రతీసారి ఆ సీన్ గుర్తొస్తుందని అన్నారు. 'కాంతార చిత్రం తర్వాత నా లైఫ్ మారిపోయింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సక్సెస్ నా టీంకు చెందుతుంది.' అంటూ చెప్పారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 'వరాహ రూపం'ను మించేలా ఉన్న 'బ్రహ్మ కలశ' సాంగ్ ఆకట్టుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Anupama Parameswaran : అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
Modern Missamma Lyrics - మిస్సమ్మ లిరిక్స్... ట్రెండీగా 'మోడ్రన్ మిస్సమ్మ' టైటిల్ సాంగ్... గోపీసుందర్ ట్యూన్, కిట్టు లిరిక్స్ ఎలా ఉన్నాయంటే?
మిస్సమ్మ లిరిక్స్... ట్రెండీగా 'మోడ్రన్ మిస్సమ్మ' టైటిల్ సాంగ్... గోపీసుందర్ ట్యూన్, కిట్టు లిరిక్స్ ఎలా ఉన్నాయంటే?
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget