OG Comic Book: 'OG' గురించి మరింత తెలుసుకోవాలా? - కామిక్ బుక్ వచ్చేసింది... ఆ క్వశ్చన్స్‌కు ఆన్సర్ తెలియాలంటే...
Pawan Kalyan: పవన్ 'OG' మేనియా కొనసాగుతుండగానే కామిక్ బుక్ రిలీజ్ చేస్తూ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. తాజాగా రిలీజ్ చేసిన స్పెషల్ ప్రోమో వీడియో వైరల్ అవుతోంది.

Pawan Kalyan's OG Comic Book Released: ప్రస్తుతం ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'OG' మేనియా నడుస్తోంది. ఫ్యాన్స్ జోష్ మరింత పెంచేలా తాజాగా బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు డైరెక్టర్ సుజీత్. 'ఓజీ' కామిక్ బుక్‌ను రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి స్పెషల్ ప్రోమో వీడియో రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది.
రిలీజ్‌కు ముందే సర్ ప్రైజ్
నిజానికి 'OG' రిలీజ్‌కు ముందే పవర్ స్టార్ క్రేజ్‌కు తగ్గట్లుగా బిగ్ సర్ ప్రైజ్‌లు ఇచ్చారు మేకర్స్. ప్రమోషన్స్ కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ఓ సర్ ప్రైజ్ రివీల్ కావాలంటే గేమ్ ఆడాలంటూ ఫ్యాన్స్ అందరితోనూ గేమ్ ఆడించారు. ఇక 'ఓజీ' గేమ్ అన్ లాక్ అయ్యే కొద్దీ 'కామిక్ బుక్' అంటూ సీక్రెట్ రివీల్ చేశారు.
'OG' కామిక్ బుక్ రిలీజ్
'ఓజీ' కామిక్ బుక్ రూపొందించిన డైరెక్టర్ సుజీత్... ఆ పుస్తకానికి 'ఓజీ: ది ఫస్ట్ బ్లడ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే, కవర్ పేజీపై సుభాష్ చంద్రబోస్ ఉండడం ఫ్యాన్స్‌కు మరింత సస్పెన్స్ క్రియేట్ చేసింది. కటానాకు ఓ వైపు పవన్ కల్యాణ్ మరో వైపు నేతాజీ ఉండడం... మరో మహిళ చేతిలో చిన్నారి ఉండడం కూడా చర్చనీయాంశమైంది. 'OG' సినిమాకు ముందు జరిగే కథగా ఈ బుక్ రూపొందించినట్లు చెప్పారు డైరెక్టర్.
బుక్‌లో ఏముంది?
ఈ కామిక్ బుక్‌లో పవన్ పోషించిన సమురాయ్ పాత్ర ఒరోజు జెన్షిన్ (OG) గతంతో పాటు, అతని నేపథ్య కథ, ఓజాస్ గంభీరతో అతనికి సంబంధం ఏంటి?, మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది సినిమాగా రెండో పార్టులో చూపిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. కామిక్ బుక్ స్పెషల్ ప్రోమో రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. ఈ కామిక్ డిజిటల్ కాపీ ధర రూ.360 కాగా లింక్ సైతం షేర్ చేశారు. దీంతో ట్రెండ్ అవుతోంది.
The Origin. Legacy. Bloodline. 🔥
— Sujeeth (@Sujeethsign) September 28, 2025
OG: The First Blood comic is HERE!
⚡ Claim your piece of the beginning 👉 https://t.co/dfjWydA7v7#OG #TheyCallHimOG pic.twitter.com/VQDrN33qnh
పవర్ స్టార్ పేరు వింటేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి. అలాంటి ఆయన్ను సగటు ఫ్యాన్‌గా అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సిల్వర్ స్క్రీన్‌పై అలానే చూపించారు డైరెక్టర్ సుజీత్. ఆయన గ్రేస్, జోష్‌కు తగ్గట్లుగానే హీరోయిజంకు పర్ఫెక్స్ ఎలివేషన్స్ ఇస్తూ కొన్ని సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా రూపొందించారు. గ్యాంగ్ స్టర్ 'ఓజాస్ గంభీర'గా భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పవన్‌ను చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు కామిక్ బుక్ రూపంలో 'ఓజీ' (OG Comic Book) గురించి మరిన్ని విశేషాలను తెలుసుకోవచ్చు.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు























