కర్ణాటకలో ‘కేజీయఫ్: చాప్టర్ 2’ కలెక్షన్లను కూడా ‘కాంతార’ క్రాస్ చేసింది.



భారతదేశంలో ఐదో వారం ‘బాహుబలి: ది కంక్లూజన్’ కంటే ఎక్కువ కలెక్షన్లను ‘కాంతార’ దక్కించుకుంది.

ఆరో వారంలో అత్యధిక వసూళ్ల రికార్డును ఆ వీకెండ్‌లోనే ‘కాంతార’ దాటేసింది.

ఎనిమిదో వారంలో ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ రికార్డును 50 శాతం మార్జిన్‌తో దాటింది.

కనీసం 10 వారాల పాటు ప్రతి వారం ఏదో ఒక రికార్డును ‘కాంతార’ బద్దలు కొట్టింది.

ఎనిమిదో వారంలో కూడా ‘కాంతార’ కర్ణాటకలో 300 థియేటర్లలో ఆడింది. అక్కడ ఇదే రికార్డు.

కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ‘కేజీయఫ్: చాప్టర్ 2’ రికార్డును ‘కాంతార’ బద్దలు కొట్టింది.

ఈ మధ్య కాలంలో పెట్టుబడితో పోలిస్తే ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచింది.

హిందీలో మొదటిరోజుతో పోలిస్తే 80 రెట్ల అధిక వసూళ్లను మల్టీఫ్లెక్స్‌లో సాధించింది.

జానపదాల నేపథ్యంలో భారతదేశంలో ఇంత పెద్ద హిట్ అయిన సినిమా ఇదే.