డాక్టర్ బాబుఅలియాస్ నిరుపమ్ పరిటాల.. పరిచయం అవసరం లేని పేరు. ఆయన భార్య మంజులా నిరుపమ్ కూడా టీవీ నటి. నిరుపమ్, మంజులది ప్రేమ వివాహం. వీళ్ళకి బాబు ఉన్నాడు. 'చంద్రముఖి' సీరియల్ కోసం తొలిసారిగా వీరిద్దరూ కలిసి పని చేశారు. ఈ సీరియల్ మంజులకి తొలి తెలుగు సీరియల్. ఏడాది పాటు ఇద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న తర్వాత ప్రేమించుకున్నారు. తర్వాత ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కార్తీకదీపం సీరియల్ తో డాక్టర్ బాబు ఫుల్ ఫేమస్ అయిపోయాడు. మంజుల యూట్యూబ్ ఛానెల్ లో వీళ్ళ ప్రేమ గురించి వీడియో కూడా పెట్టారు. మంజుల, నిరుపమ్ ఇద్దరూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. రీల్స్ చేస్తూ వాటిని పోస్ట్ చేస్తారు. బంగారం.. చెప్పనా అంటూ భర్తతో రీల్ చేసిన మంజుల బుల్లితెర క్యూట్ కపుల్ గా మంజుల, నిరుపమ్ పలు టీవీ షోస్ లో కూడా పాల్గొన్నారు. ఉగాది పండుగ వేడుకల్లో భాగంగా జరిగిన ఒక ప్రోగ్రామ్ లో సీరియల్ నటులందరూ కలిసి మరోసారి మంజుల, నిరుపమ్ కి పెళ్లి చేశారు. Images Credit: Manujula/ Nirupam Paritala/ Instagram