విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌లు వివాహం చేసుకుని నేటికి ఏడాది అవుతుంది. ఈ సందర్భంగా వారిద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సోషల్ మీడియాలో వీరిద్దరి జోడికి మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి ఫొటోలు ఎప్పుడు సోషల్ మీడియాలో పెట్టినా వెంటనే వైరల్ అవుతాయి. ఈ జోడికి ఫ్యాన్స్ కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. విక్కీ కౌశల్ నటించిన ‘గోవిందా నామ్ మేరా’ డిసెంబర్ 16న విడుదల కానుంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ డైరెక్ట్‌గా దీన్ని స్ట్రీమ్ చేయనున్నారు. ప్రస్తుతం విక్కీ కౌశల్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. ఇక కత్రినా కైఫ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ‘మెర్రీ క్రిస్మస్’, ‘టైగర్ 3’ సినిమాలు 2023లో విడుదల కానున్నాయి.