Vijay Karur Stampede News | కరూర్ లో ఘోర విషాదం..విజయ్ సభలో 30మంది మృతి | ABP Desam
తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ తమిళనాడులో కరూర్ లో నిర్వహించిన రాజకీయ సభలో ఘోర విషాదం నెలకొంది. విజయ్ కార్నర్ మీటింగ్ కు భారీగా కార్యకర్తలు, అభిమానులు హాజరుకాగా సభ ముగిసిన తొక్కిసలాట జరిగింది. ఒక్క సారిగా ప్రజలు సభా స్థలాన్ని వీడి వెళ్తున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతి చెందారు. 50మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను సీఎం స్టాలి్ రేపు కలవనున్నారు. విజయ్ సభకు కనీసం పదివేల మంది వస్తారని కరూర్ పోలీసులకు టీవీకే పార్టీ ముందస్తు సమాచారం అందించింది. అనుకున్న దాని కంటే ఐదింతలు ఎక్కువగా యాభై వేల మంది కార్యకర్తలు, అభిమానులు విజయ్ కార్నర్ మీటింగ్ కు హాజరు కాగా...అక్కడ అంత మందిని హ్యాండిల్ చేసే వ్యవస్థ లేకపోవటంతో ఈ ఘోర విషాదం నెలకొంది.





















