Asia Cup Final India vs Pakistan | ఇండియా, పాక్ మధ్య మరో కాంట్రవర్సీ
ఆసియాకప్ లో ఇండియా పాకిస్తాన్ మధ్య మరో కాంట్రవర్సీ మొదలయింది. సాధారణంగా టోర్నమెంట్ ఫైనల్ కు ముందు రెండు జట్ల కెప్టెన్లతో ఫోటో షూట్ నిర్వహిస్తారు. కానీ ఆసియాకప్ ఫైనల్ కు ముందు ఫోటో షూట్ జరిగే అవకాశం లేనట్లు తెలుస్తుంది. ఈ విషయంపై పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా స్పందించాడు. తాము ప్రోటోకాల్ ప్రకారం అన్నీ చేయడానికి సిద్దమేనని, ఇందుకు టీమ్ ఇండియా నుంచి సహకారం కావాలని సూచించాడు. ఫైనల్ కు ముందు ఫోటో షూట్ ను టీమిండియా బహిష్కరించినట్లు తెలుస్తోంది. ఇండియా పాక్ మధ్య హ్యాండ్ షేక్ వివాదం, సూర్య కుమార్ యాదవ్ పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ లో ఆపరేషన్ సింధూర్ , మిలిటరీ గురించి మాట్లాడటం, సాహిబ్ జాదా ఫర్హాన్ గన్ షూటింగ్ సెలెబ్రేషన్స్ అంటూ ఎన్నో వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఫొటో షూట్ వివాదం మొదలయింది.
1984లో ఆసియాకప్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇండియా టోర్నీని ఎనిమిది సార్లు గెలిచింది. ఈ మ్యాచ్ లో తొమ్మిదో టైటిల్ సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇక లీగ్ దశలో ఒకసారి, సూపర్-4లో మరోసారి పాక్ ను ఓడించిన భారత్ చాంపియన్ గా నిలవాలని భావిస్తోంది.





















