India vs Pakistan Final Revange Asia Cup 2025 | ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ!
ఆసియా కప్ 2025 లో టీమిండియా పాకిస్తాన్ ను మూడో సారి ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని చూస్తుంది. అయితే గత కొన్నేళ్లుగా ఇండియాపై పాకిస్తాన్ గెలవలేదు. అయినప్పటికీ కూడా ఫ్యాన్స్ మాత్రం ఒక విషయంలో చాలా డిస్సపాయింట్ గా ఉన్నారు. అదే ఛాంపియన్స్ ట్రోఫీ 2017. ఆ ఫైనల్ లో పాకిస్తాన్ ఇండియాను 180 పరుగుల తేడాతో ఓడించింది. సో ఆ ఫైనల్ కు ప్రతీకారం ఈ మ్యాచ్ లో ఇండియా తీర్చుకోవాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత భారత్, పాకిస్తాన్ మళ్ళి ఇప్పుడే ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ ను ఓడించి 8 ఏళ్ల ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తన్నారు. ఇక ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్య 5 ఫైనల్ మ్యాచ్‌లు జరిగాయి. పాకిస్తాన్ 3 సార్లు గెలుస్తే.. భారత్ 2 సార్లు గెలిచింది. చివరిసారి ఇరు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ చాంపియన్స్ ట్రోఫీ 2017 జరిగింది. మరి ఈ ఫైనల్లో టీమిండియా పాకిస్తాన్ ను ఓడించి ఫ్యాన్స్ కోరిక తీరుస్తారో లేదో చూడాలి.





















