India vs Pakistan Asia Cup 2025 Final | నేడే ఆసియా కప్ ఫైనల్
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫైనల్ మ్యాచ్ కి టైం దెగ్గర పడింది. ఆసియా కప్ ఫైనల్ లో ఇండియా పాకిస్తాన్ మొదటి సారి తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని రెండు టీమ్స్ కసిగా ఉన్నాయి. షేక్ హ్యాండ్ వివాదం, మ్యాచ్ రెఫరీ వివాదం అంటూ ఇలా ఇండియా పాక్ మధ్య చిన్న పాటి యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికే వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఇండియా .. ఫైనల్ లో కూడా అదే ప్రదర్శన కనబర్చాలని చూస్తుంది. ఇక పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతుంది.
బ్యాటింగ్ ,బౌలింగ్ లో చూసుకుంటే ఇండియా టాప్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. ఈ టోర్నమెంట్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఓపెనర్ శుభమాన్ గిల్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నుంచి ఫ్యాన్స్ అందరు భారీ స్కోరు ఆశిస్తున్నారు. తిలక్ వర్మ, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శివమ్ దూబే సత్తా చాటుతున్నారు. లంకతో మ్యాచ్ లో గాయపడిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ కు అందుబాటులోకి వస్తాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి అదరగొడుతున్నారు. ఇప్పటికే 8 టైటిళ్లు గెలిచిన భారత్, తొమ్మిదో టైటిల్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.
ఈ టోర్నీలో అంతంతమాత్రం ప్రదర్శన కనబర్చినా కూడా పాకిస్తాన్ ఫైనల్ కు చేరుకుంది. బౌలింగ్ కాస్త బలంగా ఉన్నా కూడా బ్యాటర్లు పెద్దగా ఎవరూ లేరు. రెండుసార్లు భారత్ పై ఓడిపోవడంతో పాక్ కసిగా ఉంది. 2022 తర్వాత ఇండియాపై ఆ పాకిస్తాన్ ఏ ఫార్మాట్ లోనూ గెలవలేదు. మరి ఈ ఫైనల్ లో ఎలా ప్రదర్శిస్తారో చూడాలి.





















