Asia cup final Ind vs Pak live streaming Free: భారత్, పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఉచితంగా ఇలా చూసేయండి
INDIA vs PAKISTAN Final Live Streaming: భారత్-పాకిస్తాన్ ఆసియా కప్ 2025 ఫైనల్ నేటి రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం అవుతుంది.

IND vs PAK Final Live Streaming: భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే కోట్లాది మంది అభిమానులకు గుండె చప్పుడు పెరుగుతోంది. ఈ రెండు జట్లు ఆసియా కప్ 2025 ఫైనల్‌లో నేటి రాత్రి తలపడనున్నాయి, కనుక నేడు ఉత్కంఠ మరింత పెరుగుతుంది. 41 సంవత్సరాల చరిత్రలో, గత 16 ఎడిషన్లలో మొదటిసారిగా భారత్, పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్లో తలపడుతున్నాయి. చివరగా తొలి ఎడిషన్ లో భారత్ 54 పరుగులతో ఫైనల్లో పాక్ మీద విజయం సాధించింది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజు (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది.
లైవ్ ఎక్కడ చూడాలంటే?
ఆసియా కప్ 2025 మ్యాచ్ ప్రసారాలను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అందిస్తుంది. క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్‌ని సోనీ స్పోర్ట్స్ ఛానెల్‌లలో (Sony Sports 1, 2, 3, 5)లలో ప్రత్యక్షంగా చూడవచ్చు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అయితే Sony Liv యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. ఫ్యాన్ కోడ్ యాప్ సబ్ స్క్రిప్షన్ ఉన్నవారు మ్యాచ్ లైవ్ వీక్షించవచ్చు.
ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ...! #IndvsPak #asiacup2025 #MatchPreview #FinalMatch #indiavspakistan #2017championstrophy #cricket #SportsNews #TeluguNews #ABPDesam pic.twitter.com/ZF40GEH7vl
— ABP Desam (@ABPDesam) September 28, 2025
మ్యాచ్‌ని ఉచితంగా చూడవచ్చా?
క్రికెట్ అభిమానులకు శుభవార్త ఏమిటంటే, భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే ఈ హై-వోల్టేజ్ ఫైనల్ DD స్పోర్ట్స్ ఛానెల్‌లో ఉచితంగా ప్రసారం అవుతుంది. అంటే, మీ వద్ద DTH లేదా కేబుల్ కనెక్షన్ ఉంటే, మీరు ఈ మ్యాచ్‌ని మీ టీవీలో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చూసి భారత్, పాక్ ఫైనల్ మ్యాచ్ మాజాను ఆస్వాదించవచ్చు.
టాస్ టైమ్
భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 7:30 గంటలకు టాస్ వేస్తారు. దుబాయ్ స్టేడియం పిచ్ స్వభావాన్ని బట్టి టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బౌలింగ్ ఎంచుకుంటారని అంచనా వేస్తున్నారు. తద్వారా మంచు ప్రయోజనాన్ని పొందవచ్చు. గత రెండు మ్యాచ్‌లలో పాకిస్తాన్ వేర్వేరు వ్యూహాలను ఉపయోగించినా రెండుసార్లు భారత్ విజయం సాధించింది.
భారత్ తో మ్యాచ్ అంటే ఒత్తిడే !#asiacup2025 #IndvsPak #indiavspakistan #MatchPreview #FinalMatch #shakehandcontroversy #suryakumaryadav #salmanaliagha #cricket #SportsNews #TeluguNews #ABPDesam pic.twitter.com/gvYU0tA7fp
— ABP Desam (@ABPDesam) September 28, 2025
భారత్, పాకిస్తాన్ ఫైనల్ ఎలా చేరాయంటే
భారత్ ఈ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఇప్పటివరకు అజేయంగా ఉంది. సూపర్-4లో తమ రెండవ మ్యాచ్‌లో ఇండియా బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. అదే సమయంలో పాకిస్తాన్ సూపర్-4లో బంగ్లాదేశ్‌ను 11 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ చేరింది. ప్రస్తుత ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ ఇప్పటికే రెండుసార్లు తలపడగా ఈ 2 మ్యాచ్‌లలో భారత్ గెలిచింది.
గ్రూప్ స్టేజ్ - పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది భారత్.
సూపర్-4 - పాకిస్తాన్‌ను 41 పరుగుల తేడాతో ఓడించింది భారత్.
ప్లేయింగ్ XI అంచనా
భారత్ - అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాకిస్తాన్ - సామ్ అయూబ్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సల్మాన్ ఆగా (కెప్టెన్), మహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, సుఫియాన్ ముకీమ్.





















