అన్వేషించండి
Advertisement
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్, ఎగ్జిట్ పోల్స్‌లో హస్తందే హవా వంటి మార్నింగ్ టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Top 10 News :
1. తిరుమల అన్నదాన ప్రసాదంలో జెర్రీ..!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో పెరుగు అన్నంలో జెర్రీ వచ్చిందన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రీ కనిపించిందని తెలుస్తోంది. దీనిపై భక్తులు టీటీడీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. టిటిడి సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో పాటు అక్కడినుంచి తమను వెళ్ళిపోమన్నారని చెబుతూ భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అన్న ప్రసాదంలో జెర్రీ వచ్చిందన్న విషయం పూర్తిగా దుష్ప్రచారం అని, వదంతులను టీటీడీ ఖండించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
2. ఏపీ టెట్ ప్రైమరీ కీ విడుదల
ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలకు సంబంధించి అక్టోబర్ 3, 4వ తేదీల్లో నిర్వహించిన పరీక్షల ప్రాథమిక 'కీ'ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందబాటులో ఉంచింది. మిగతా పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ ‘కీ’లను పరీక్ష జరిగిన తర్వాతిరోజు విడుదల చేస్తారు. ఆన్సర్ కీలతోపాటు పరీక్షల ప్రశ్నపత్రాలను సైతం విద్యాశాఖ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
3. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా..?
మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేయనున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. KTRను టార్గెట్ చేసే క్రమంలో నాగార్జున కుటుంబం గురించి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. హైకమాండ్ సూచనతో కొండా సురేఖ రాజీనామా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో కొండా సురేఖను పదవి నుంచి తొలగిస్తారని టాక్ వినిపిస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
4. తెలంగాణలో మూడురోజులు వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, యాదాద్రి భువనగిరి, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
5. జానీ మాస్టర్‌కు బిగ్ షాక్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేశారు. పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అత్యాచారం ఆరోపణలపై జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేయగా, ఇటీవల బెయిల్‌పై బయటికొచ్చిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
6. హర్షసాయి బాధితురాలి లాయర్ వార్నింగ్
కొన్ని మీడియా, యూట్యూబ్ ఛానల్స్ నిజాలు తెలియకుండా తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నాయని హర్షసాయి కేసులో బాధితురాలి తరఫు లాయర్ నాగూర్ బాబు మండిపడ్డారు. రూ.2 కోట్ల కోసమే బాధితురాలు ఇదంతూ చేస్తుందన్న వార్తల్లో వాస్తవం లేదని లాయర్ స్పష్టం చేశారు. బాధితురాలిపై లేని అభియోగాలను మోపుతూ ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్ వాయిస్‌తో ఆడియో ఫైల్స్ రిలీజ్ చేస్తున్నారంటూ న్యాయవాది మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
7. జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమికే మొగ్గు
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మొగ్గు కాంగ్రెస్ కూటమి వైపే ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. జమ్ముకశ్మీర్ లో మొత్తం 90 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 46. సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో కాంగ్రెస్, ఎన్సీ కూటమికి 40 నుంచి 48 సీట్లు వస్తాయని తేలింది. బీజేపీకి 27-32, పీడీపీ 6 నుంచి 12 సీట్లు, ఇతరులకు 6 నుంచి 11 సీట్ల వరకు రానున్నాయి. కాంగ్రెస్ కూటమికి 45-46, బీజేపీకి 23-27 స్థానాలు దక్కే అవకాశం ఉందని పీపుల్స్ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 49-61, బీజేపీకి 20- 32 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ తెలిపింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
8. హరియాణాలోనూ హస్తందే హవా
హరియాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. హరియాణాలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 46. కాంగ్రెస్ కూటమికి 44 - 54, బీజేపీకి 15 - 29 సీట్లు వస్తాయని దైనిక్ భాస్కర్ తెలిపింది. కాంగ్రెస్ కూటమికి 55, బీజేపీ 26 సీట్లు వస్తాయని పీపుల్స్ సర్వే అంచనా వేసింది. కూటమికి 49-61 సీట్లు, బీజేపీకి 20 - 32 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
9. ఎన్ కౌంటర్‌లో హతమైన మావోయిస్టుల వివరాలు వెల్లడి
ఛత్తీస్ ఘడ్ లోని దంతేవాడ సరిహద్దులో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన 31 మంది మావోయిస్టులలో సగం మందిని పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారిలో 18 పురుషులు, 13 మహిళలు ఉన్నారని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల ఎస్పీలు తెలిపారు. వారిలో 16 మందిని గుర్తించామని, వారిపై రూ. 1 కోటి 30 లక్షల రూపాయలకు పైగా రివార్డు ఉందన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10. విజయాలు నమోదు చేసుకున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్
టీ 20 ప్రపంచకప్‌లో డిఫెండిగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తన పోరాటాన్ని ఘనంగా కొనసాగిస్తోంది . తొలుత బ్యాట్‌తో తర్వాత బంతితో చెలరేగిన కంగారులు 6 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించారు. అటు ఇంగ్లాండ్ కూడా శుభారంభం చేసింది. 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement