Jani Master: జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master National Award Revoked | జాతీయ స్థాయిలో బెస్ట్ కొరియోగ్రాఫర్ గా నిలిచిన జానీ మాస్టర్ కు మరో షాక్ తగిలింది. పోక్సో కేసు నమోదైనందున అవార్డుల కమిటీ జానీ మాస్టర్ అవార్డును వెనక్కి తీసుకుంది.
National Award For Jani Master | హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు భారీ షాక్ తగిలింది. ఆయనకు ప్రకటించిన బెస్ట్ కొరియోగ్రాఫర్ నేషనల్ అవార్డును నిలిపివేశారు. ఈ మేరకు అవార్డు కమిటీ శనివారం రాత్రి తమ నిర్ణయాన్ని ప్రకటించింది. కొన్ని రోజల కిందట కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలపై వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదుతో పోక్సో చట్టం (POCSO Act) కింద జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేయడం తెలిసిందే.
నేషనల్ ఫిల్మ్ అవార్డుల కమిటీ 2022 ఏడాదికి గానూ జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును జానీ మాస్టర్ కు ఇటీవల ప్రకటించార. ఈ అవార్డు తీసుకునేందుకుగానూ జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కూడా తీసుకున్నాడు. ఢిల్లీలో జరగనున్న అవార్డుల ఫంక్షన్ కు హాజరయ్యేందుకు అక్టోబర్ 6 నుంచి 9 వరకు జానీ మాస్టర్ కు బెయిల్ లభించింది. అయితే అవార్డుల కమిటీ జానీ మాస్టర్ కు ప్రకటించిన బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోడంతో ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) కొన్ని రోజుల కింద అరెస్టయ్యాడు. ఆయన దగ్గర సహాయకురాలిగ పని చేసిన లేడీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణలు చేశారు. తనను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు వేరే రాష్ట్రానికి వెళ్లి జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. వేధింపుల సమయంలో లేడీ కొరియోగ్రాఫర్ మైనర్ అని జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులతో పాటు ఫోక్సో చట్టం కింద అభియోగాలు నమోదు అయ్యాయి. అంతకుముందే జానీ మాస్టర్ కు బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జాతీయ అవార్డు ప్రకటించారు.
బెయిల్ రద్దు అవుతుందా?
ఆ అవార్డు ఫంక్షన్ కు హాజరై అవార్డు తీసుకునేందుకు జానీ మాస్టర్ కోర్టును ఆశ్రయించాడు. ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు అక్టోబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జానీ మాస్టర్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ స్వల్ప ఊరట కలిగించింది. మరికొన్ని గంటల్లో జానీ మాస్టర్ జైలు నుంచి విడుదల కానున్న తరుణంలో అతడికి ఊహించని షాక్ తగిలింది. పోక్సో లాంటి కేసు నమోదైన కారణంగా, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న కారణాలతో జానీ మాస్టర్ కు ప్రకటించిన జాతీయ అవార్డును కమిటీ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. దాంతో జానీ మాస్టర్ కు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ఆయన జైలు నుంచి విడుదలకు ముందే రద్దు అయ్యే అవకాశం ఉంది.
జానీపై జనసేన వేటు
సెప్టెంబర్ 16న ఫిర్యాదు నార్సింగి పోలీసు స్టేషన్‌లో జానీ మాస్టర్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో జనసేన ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీ కార్యక్రమాలకు జానీ దూరంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మరోవైపు టాలీవుడ్ లోనూ తెలుగు టీవీ అండ్ సినిమా డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి నుంచి జానీ మాస్టర్ ను తాత్కాలికంగా తొలగించారు.