అన్వేషించండి

AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే

AP TET 2024 Answer Key: ఏపీటెట్ జులై-2024 పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీని విద్యాశాఖ విడుదల చేసింది. అక్టోబరు 3, 4 తేదీల్లో పరీక్షలకు హాజరైనవారు ఆన్సర్ కీని చూసుకోవచ్చు.

APTET-2024 Initial Key: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET JULY-2024)లకు సంబంధించి అక్టోబర్‌ 3, 4వ తేదీల్లో నిర్వహించిన పరీక్షల ప్రాథమిక 'కీ' పాఠశాల విద్యాశాఖ అక్టోబరు 5న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను అందబాటులో ఉంచింది. మిగతా పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ ‘కీ’లను పరీక్ష జరిగిన తర్వాతిరోజు విడుదల చేస్తారు. ఆన్సర్ కీలతోపాటు పరీక్షల ప్రశ్నపత్రాలను సైతం విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే కాల్ సెంటర్ నెంబర్లు: 9398810958, 6281704160, 8121947387, 8125046997, 9398822554, 7995649286, 7995789286, 9505619127, 9963069286, 9398822618లలో లేదా ఈమెయిల్: grievances.tet@apschooledu.in ద్వారా సంప్రదించవచ్చు.  

ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల అర్హత పరీక్ష 'ఏపీటెట్ జులై-2024' (APTET JULY-2024) నోటిఫికేషన్ జులై 1న వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఏపీటెట్ ఫీజు చెల్లింపు ప్రక్రియ జులై 3న ప్రారంభంకాగా.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 4న ప్రారంభమైంది. అభ్యర్థుల నుంచి ఆగస్టు 3 వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఏపీటెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 3న ప్రారంభమైన కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు (సీబీటీ) అక్టోబరు 21 వరకు కొనసాగనున్నాయి. విడుదల చేసిన ఆన్సర్ కీలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే త్వరలోనే అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అక్టోబర్‌ 27న తుది ‘కీ’ విడుదల చేసి; నవంబర్‌ 2న ఫలితాలను ప్రకటించనున్నారు. 

ఏపీటెట్  జులై -  2024 ప్రాథమిక ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం:

➥  ఒక్కో పేపరుకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 2.30 గంటలు.

➥ పేపర్-1 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-1 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-2 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్/బయాలజీ/ఫిజిక్స్/సోషల్ స్టడీస్/లాంగ్వేజ్-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-2 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, కేటగిరీ ఆఫ్ డిజెబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగోగి -60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.

కేటగిరీలవారీగా అర్హత మార్కులు..
ఏపీ టెట్ పరీక్షలో అర్హత మార్కులను ఓసీ(జనరల్‌) అభ్యర్థులకు- 60 శాతంగా, బీసీ అభ్యర్థులకు- 50 శాతంగా, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు.

 

APTET July 2024 - నోటిఫికేషన్, పరీక్ష సిలబస్, పరీక్ష విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల
నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల
Pushpa 2 Theaters Seized: ఏపీలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లు సీజ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం
ఏపీలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లు సీజ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం
Jagan Mohan Reddy Tour: శ్రీకాకుళం జిల్లా నుంచే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభం! ప్రతి బుధవారం నియోజకవర్గంలోనే నిద్ర
శ్రీకాకుళం జిల్లా నుంచే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభం! ప్రతి బుధవారం నియోజకవర్గంలోనే నిద్ర
Rains In AP and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో 3 రోజులపాటు వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో 3 రోజులపాటు వర్షాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడాSiraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల
నాడు జగన్ అదానీకి అమ్ముడుపోయారు! నేడు చంద్రబాబు అమ్ముడుపోయారా? నిలదీసిన షర్మిల
Pushpa 2 Theaters Seized: ఏపీలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లు సీజ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం
ఏపీలో పుష్ప 2 ప్రదర్శిస్తున్న థియేటర్లు సీజ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం
Jagan Mohan Reddy Tour: శ్రీకాకుళం జిల్లా నుంచే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభం! ప్రతి బుధవారం నియోజకవర్గంలోనే నిద్ర
శ్రీకాకుళం జిల్లా నుంచే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభం! ప్రతి బుధవారం నియోజకవర్గంలోనే నిద్ర
Rains In AP and Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో 3 రోజులపాటు వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాల్లో 3 రోజులపాటు వర్షాలు
captain Virat Kohli: మళ్లీ కెప్టెన్ అవతారమెత్తిన కోహ్లీ- రోహిత్ కు సూచనలు, ఫీల్డ్ సెట్టింగ్
మళ్లీ కెప్టెన్ అవతారమెత్తిన కోహ్లీ- రోహిత్ కు సూచనలు, ఫీల్డ్ సెట్టింగ్
Congress One Year Rule: రేవంత్ పాలనకు ఏడాది - కేసీఆర్‌ను గుర్తులను చెరిపేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లేనా ?
రేవంత్ పాలనకు ఏడాది - కేసీఆర్‌ను గుర్తులను చెరిపేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లేనా ?
Viral News: 25 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థినితో కథ నడిపిన 65 ఏళ్ల యూకే వర్శిటీ వైస్ చాన్సలర్ - బయటపడేసరికి రోడ్డునపడ్డాడు!
25 ఏళ్ల హైదరాబాద్ విద్యార్థినితో కథ నడిపిన 65 ఏళ్ల యూకే వర్శిటీ వైస్ చాన్సలర్ - బయటపడేసరికి రోడ్డునపడ్డాడు!
Allu Arjun: ఫ్యాన్ వార్స్‌కు చెక్ పెడుతోన్న అల్లు అర్జున్... ఆర్మీకి అసోసియేషన్ హెచ్చరికలు - డేంజర్ బెల్స్ మొదలు
ఫ్యాన్ వార్స్‌కు చెక్ పెడుతోన్న అల్లు అర్జున్... ఆర్మీకి అసోసియేషన్ హెచ్చరికలు - డేంజర్ బెల్స్ మొదలు
Embed widget