అన్వేషించండి

AP TET Notification: ఏపీటెట్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది- అర్హతలు, పరీక్ష షెడ్యూలు, సిలబస్ పూర్తివివరాలు ఇలా

AP TET: ఏపీటెట్ జులై-2024 నోటిఫికేషన్, సమాచారం, పరీక్షల షెడ్యూలు, సిలబస్ పూర్తివివరాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలు పొందవచ్చు.

AP TET 2024 July Notification: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీటెట్ జులై (APTET July)-2024 నోటిఫికేషన్ జులై 1న వెలువడిన సంగతి తెలిసిందే. పరీక్షకు సంబంధించిన పూర్తివివరాలను జులై 2న అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు జులై 3 నుంచి 16 వరకు ఫీజు చెల్లించి, జులై 4 నుంచి 17 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు కింద ఒక్కో పేపరుకు (పేపర్-1ఎ, పేపర్-1బి, పేపర్-2ఎ, పేపర్-2బి) రూ.750 వేర్వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల సౌకర్యార్ధం జులై 16 నుంచి మాక్ టెస్టలులు రాసేందుకు అవకాశం కల్పించారు. టెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జులై 25 నుంచి హాల్‌‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఆగస్టు 5 నుంచి 20 మధ్య కంప్యూటర్ ఆధారిత విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయారోజుల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. టెట్ ప్రాథమిక 'కీ' ఆగస్టు 10న విడుదల చేయనున్నారు. ఆన్సర్ కీపై ఆగస్టు  11 నుంచి 21 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఆగస్టు 25న టెట్ తుది ఆన్సర్ కీని విడుదల చేయనున్నారు. టెట్‌ తుది ఫలితాలను ఆగస్టు 30న విడుదల చేయనున్నారు. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 

హెల్ప్‌లైన్ నెంబర్లు: 9505619127, 9705655349, 8121947387, 8125046997.

వివరాలు..

* ఏపీటెట్-జులై-2024 (AP TET 2024)

అర్హతలు..

🔰 పేపర్-1 ఎ (1 - 5వ తరగతులకు)
➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)
➥ ఏదైనా డిగ్రీతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ ఏదైనా డిగ్రీతోపాటు 50 శాతం మార్కులతో బ్యాచిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు  బీఈడీ లేదా ఎంఈడీ అర్హత ఉండాలి. 
➥ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కులు మినహాయింపు వర్తిస్తుంది.

🔰 పేపర్-1 బి (1 - 5వ తరగతులు) స్పెషల్ స్కూల్స్ 
➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో రెండేళ్ల డీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్ - ఏదైనా డిజెబిలిటీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో ఏడాది డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్ - ఏదైనా డిజెబిలిటీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ డిప్లొమా (కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ పీజీ డిప్లొమా (కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ డిప్లొమా (మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ జూనియర్ డిప్లొమా (టీచింగ్-డెఫ్) అర్హత ఉండాలి. (లేదా)
➥ ప్రైమరీ లెవల్ టీచర్ ట్రైనింగ్ కోర్సు (విజువల్ ఇంపేర్‌మెంట్)
➥ డిప్లొమా (ఒకేషనల్ రిహాబిలిటేషన్-మెంటల్ రిహాబిలిటేషన్)/ డిప్లొమా (ఒకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్-మెంటల్ రిటార్డేషన్)తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ డిప్లొమా (హియరింగ్ లాంగ్వేజ్ & స్పీచ్‌తోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి. (లేదా)
➥ ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో RCI గుర్తింపు పొందిన ఏడాది కోర్సు కలిగి ఉండాలి. దీంతోపాటు ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ (స్పెషన్ నీడ్స్) అర్హత ఉండాలి.

🔰  పేపర్-2 ఎ (6 - 8వ తరగతులు)
మ్యాథమెటిక్స్-ఫిజికల్ సైన్స్/బయోలాజికల్ సైన్స్/ సోషల్ స్టడీస్/ లాంగ్వేజ్ టీచర్లు 
➥ 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీతోపాటు బీఈడీ ఉండాలి. (లేదా)
➥ 45 శాతం మార్కులతో డిగ్రీతోపాటు ఏడాది బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగి ఉండాలి.  (లేదా)
➥ 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)
➥ 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు నాలుగేళ్ల బీఏ/బీఎస్సీ లేదా బీఏఈడీ/బీఎస్‌ఈఈడీ. (లేదా)
➥ 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు ఏడాది బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత కలిగి ఉండాలి. (లేదా)
➥ 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ-ఎంఈడీ అర్హత కలిగి ఉండాలి. (లేదా)
➥ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు మినహాయింపు వర్తిస్తుంది.

🔰  లాంగ్వేజ్ టీచర్స్..
లాంగ్వేజ్ టీచర్స్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ ఉండాలి. (లేదా) బ్యాచిలర్ ఆఫ్ ఒరియంటెల్ లాంగ్వేజ్ (లేదా) గ్రాడ్యేయే పీషన్ (లిటరేచర్) (లేదా)  సంబంధిత లాంగ్వేజ్‌లో పీజీ డిగ్రీతోపాటు లాంగ్వేజ్ పండిట్ సర్టిఫికేట్/బీఈడీ(సంబంధిత లాంగ్వేజ్‌) కలిగి ఉండాలి. 
🔰 పేపర్-2 బి (6 - 8వ తరగతులు) స్పెషల్ స్కూల్స్
➥ కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)
➥ బీఈడీ(జనరల్)తోపాటు ఏడాది డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)
➥ బీఈడీ(జనరల్)తోపాటు రెండేళ్ల డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)
➥ బీఈడీ(జనరల్)తోపాటు రెండేళ్ల పీజీ డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్/ స్పెషల్ ఎడ్యుకేషన్ మెంటల్ రిటార్డేషన్/మల్లిపుల్ డిజెబిలిటి-ఫిజికల్, న్యూరోలాజికల్/లోకోమోటర్ ఇంపేర్‌మెంట్ & సెరిబ్రల్ పాల్సీ) అర్హత ఉండాలి. 
➥ సెకండరీ లెవల్ టీచర్ ట్రైనింగ్ కోర్సు (విజువల్ ఇంపేర్‌మెంట్)/ సీనియర్ డిప్లొమా టీచింగ్(డెఫ్) అర్హత ఉండాలి. (లేదా)
➥ బీఏ.బీఈడీ (విజువల్ ఇంపేర్‌మెంట్) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 

పరీక్ష ఫీజు: ఒక్కో పేపరుకు (పేపర్-1ఎ, పేపర్-1బి, పేపర్-2ఎ, పేపర్-2బి) రూ.750 వేర్వేరుగా చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షల(ఏపీటెట్)ఆధారంగా.

పరీక్ష విధానం: ఒక్కో పేపరుకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 2.30 గంటలు.

➥ పేపర్-1 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-1 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-2 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్/బయాలజీ/ఫిజిక్స్/సోషల్ స్టడీస్/లాంగ్వేజ్-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-2 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, కేటగిరీ ఆఫ్ డిజెబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగోగి -60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.
పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 60 మార్కులు, బీసీలకు  50 మార్కులు, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులు-ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతం ఉంటే సరిపోతుంది.

ముఖ్యమైన తేదీలు..

➥ ఏపీటెట్ జులై -2024 నోటిఫికేషన్ వెల్లడి: 02.07.2024.

➥ దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 03.07.2024 -16.07.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.07.2024 - 17.07.2024.

➥ ఆన్‌లైన్ మాక్ టెస్టులు అందుబాటులో: 16.07.2024 నుంచి.

➥ టెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 25.07.2024 నుంచి 

➥ టెట్ పరీక్ష షెడ్యూలు: 05.08.2024 - 20.08.2024.  {పేపర్-1(ఎ) & పేపర్-1(బి), పేపర్-2(ఎ) & పేపర్-2(బి)}

➥ పరీక్ష సమయం..

సెషన్-1: ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.

సెషన్-2: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు

➥ టెట్ ప్రాథమిక 'కీ' విడుదల: 10.08.2024.

➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 11.08.2024 - 21.08.2024.

➥ టెట్ ఫైనల్ కీ: 25.08.2024.

➥ టెట్ ఫలితాల వెల్లడి: 30.08.2024.

Notification

Information Bulletin

AP TET Syllabus

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
Lightning Temperature vs Sun:సూర్యుడి కంటే ఐదు రెట్లు వేడి కలిగి ఉన్న పిడుగు వెనుక ఉన్న రహస్యాలివే!
సూర్యుడి కంటే ఐదు రెట్లు వేడి కలిగి ఉన్న పిడుగు వెనుక ఉన్న రహస్యాలివే!
Space Science Secretes: ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 
ఆ రెండు గ్రహాలపై వజ్రాల వాన! శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం గురించి తెలిస్తే షాక్ అవుతారు? 
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan News: ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో బిగ్‌ ట్విస్ట్! త్వరలోనే వైఎస్‌ జగన్‌ విచారణ!
What is Special Intensive Revision SIR: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలూ హైఅలర్ట్ - అందరి దృష్టి SIR పైనే - ఎందుకింత జాగ్రత్త?
Annamalai New Party Launch: తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
తమిళ పాలిటిక్స్‌లో సింగం సెకండ్ ఇన్నింగ్స్ - ఢిల్లీ ఆఫర్లను కాదని అన్నామలై కొత్త పార్టీకే మొగ్గు !
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
BJP Silent Operation North Telangana: ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
Shreyas Iyer News: టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
టీమిండియా కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్?: వరల్డ్ కప్ గెలిచినా తప్పని లీడర్ షిప్ మార్పు.. గంభీర్ ప్లాన్ కు అగార్కర్ బ్రేక్.. వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మకు ప్రమోషన్..!
Peddi Collections Day 1: సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
KS Bharat Announces Retirement:  ఇండియా టీమ్ కు గుడ్ బై చెప్పేసిన వికెట్ కీపర్.. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్
ఇండియా టీమ్ కు గుడ్ బై చెప్పేసిన వికెట్ కీపర్.. హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించిన కేఎస్ భరత్
Embed widget