అన్వేషించండి

Chhattisgarh Encounter: భారీ ఎన్ కౌంటర్‌లో హతమైన మావోయిస్టుల వివరాలు వెల్లడించిన పోలీసులు, రూ.1.3 కోట్ల రివార్డు సైతం

Maoists Killed In Encounter At Dantewada | ఛత్తీస్ ఘడ్ లోని దంతేవాడ సరిహద్దులో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టులను సగం మందిని పోలీసులు గుర్తించారు. కొందరిపై రివార్డ్ ఉంది.

Maoists Killed In Encounter At Dantewada Border In Chhattisgarh | ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ, నారాయణపూర్ జిల్లా సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టుల వివరాలను పోలీసులు ప్రకటించారు. 31 మంది సాయుధ యూనిఫాం ధరించిన మావోయిస్టులు చనిపోగా, వారిలో 18 పురుషులు, 13 మహిళలు ఉన్నారని నారాయణపూర్, దంతెవాడ జిల్లాల ఎస్పీలు తెలిపారు. నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ అడవుల్లో నెందుర్, తుల్తులి గ్రామాల్లో మావోయిస్టులకు, పోలీస్ బలగాలకు మధ్య 15 గంటలపాటు భీకర కాల్పులు జరిగాయి.

ఈ భారీ ఎన్ కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారని పోలీసులు శనివారం నాడు మీడియాకు వివరాలు తెలిపారు. వీరితోపాటు పెద్ద సంఖ్యలో నక్సలైట్లు గాయపడే అవకాశం ఉందన్నారు. చనిపోయిన వారిలో DKSZC 25 లక్షల రివార్డు, తూర్పు బస్తర్ ఇంచార్జి నీతి అలియాస్ ఊర్మిళ ఉన్నారని తెలిపారు. చనిపోయిన వారిలో 16 మంది నక్సలైట్లను గుర్తించామని.. ఈ 16 మంది నక్సలైట్లపై రూ. 1 కోటి 30 లక్షల రూపాయలకు పైగా రివార్డు ఉందని గుర్తించారు. మరో 15 మంది నక్సలైట్ల గుర్తింపు కోసం చర్యలు చేపట్టారు. మృతదేహాలను నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు.

హతమైన నక్సలైట్ల వివరాలు

1. నీతి, DKSZC 
2. సురేష్ సలాం, DVCM 
3. మీనా మడకం, DVCM
4. అర్జున్ PPCM, PLGA కంపెనీ 6
5. సుందర్ PPCM, PLGA కంపెనీ 6
6. బుధ్రామ్, PPCM PLGA కంపెనీ 6
7. సుక్కు, PGAPCM కంపెనీ
8. సోహన్, ACM, బర్సూర్ AC
9. ఫూలో, PPCM, PLGA కంపెనీ 6
10. బసంతి, PPCM, PLGA కంపెనీ 6
11. కొన్ని, PPCM, PLGA కంపెనీ 6
12. జమీలా అలియాస్ బుద్రి, PM, PLGA కంపెనీ 6
13 . ACM
14. సుక్లు అలియాస్ విజయ్ ACM
15. జమ్లీ ACM
16. సోను కొర్రమ్, ACM ఆమ్దేయి 

ఘటనా స్థలంలో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం

కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో ఏకే-47, ఎస్ ఎల్ ఆర్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  పోలీసులకు ఎలాంటి ప్రాణనష్టం జరలేదు. ఒకరిద్దరు పోలీసులు గాయపడగా, వారికి చికిత్స అందిస్తున్నారు. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతోనే  డీఆర్జీ, పారామిలటరీ బలగాలు, స్థానిక పోలీసు బలగాలతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించి వారి రహస్య స్థావరంపై దాడి చేశారు. ఏం జరిగింతో తెలుసుకునేలోపే పోలీసుల బలగాలు తమ టార్గెట్ పూర్తి చేశాయని ఉన్నతాధికారులు వివరించారు. 

నక్సలైట్ భావజాలాన్ని విడనాడాలని దంతేవాడ ఎస్పీ పిలుపు

దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ మాట్లాడుతూ.. తూర్పు బస్తర్ డివిజన్ లో అడవులు, కఠినమైన భౌగోళిక పరిస్థితులలో నివసించే సామాన్యులను నక్సలైట్ భావజాలం నుంచి కాపాడుతున్నాం. వారిని మావోయిస్టు సిద్ధాంతాల నుంచి బయటపడేయడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి, శాంతిని కొనసాగించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా చెబు ప్రభావంతో నక్సలిజం, నక్సలైట్ భావజాలానికి ఆకర్షితులవుతున్న వారిని, ప్రభుత్వ లొంగుబాటు పునరావాస విధానాన్ని అవలంబించినట్లు తెలిపారు. నక్సలైట్ భావజాలాన్ని పూర్తిగా విడనాడాలని, సాధారణ పౌరుల్లా స్వేచ్ఛగా బతకాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Embed widget