Konda Surekha : కొండా సురేఖకు పదవీ గండం - రాజీనామా చేయాలని హైకమాండ్ ఒత్తిడి !
Telangana : కొండా సురేఖతో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది
Konda Surekha Resign Issue : తెలంగాణలో కొద్ది రోజులుగా తీవ్ర ప్రకంపనలు రేపుతున్నా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారం తిరికి ఆమెకే సమస్యగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయాలతో సంబంధం లేదని ఓ కుటంబంపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని.. ఆ పార్టీ ముఖ్య నేతలకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు అన్ని వివరాలు సేకరించిన హైకమాండ్ ఆమెతో రాజీనామా చేయించాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు సమాచారం పంపినట్లగా తెలుస్తోంది.
తనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్టులు పెట్టినందునవల్లే స్పందించాల్సి వచ్చిందంటున్న కొండా సురేఖ
అయితే బీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు తనపై పెట్టిన అసభ్య పోస్టుల వల్లే ఇదంతా జరిగిందని.. తన పరువును కాపాడుకునేందుకే ఇలా స్పందించాల్సి వచ్చిందని కొండా సురేఖ వాదిస్తున్నారు. అవసరమైతే హైకమాండ్‌కు తన వాదన వినిపిస్తానని రాజీనామా చేసే ప్రశ్నే లేదని కొండా సురేఖ తన సన్నిహితులతో చెబుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నానని ఆమె గుర్తు చేస్తున్నారు. కొండా సురేఖతో రాజీనామా చేయిస్తే తప్పు చేసినట్లుగా అంగీకరించినట్లు అవుతుందని అది పార్టీకి మరింత డ్యామేజ్ చేస్తుందని కొంత మంది నేతలు వాదిస్తున్నట్లుగా తెలుస్తోంది.
నాగార్జునకు వరుస సమస్యలు - మాదాపూర్ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
రేవంత్ రెడ్డి అభిప్రాయమే కీలకం
ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయమే కీలకం కానుంది. ఆయన హైకమాండ్‌కు ఏం చెబితే దాని ప్రకారం మందుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి కొండా సురేఖను సమర్థించే అవకాశం ఎంత ఉందో.. గౌరవంగా రాజీనామా చేయమని సూచించే అవకాశం కూడా అంతే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు వరకూ కొండా వర్గీయులు, రేవంత్ కు సపోర్టుగానే ఉన్నారు. అయితే ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రేవంత్‌తో దూరం పెరిగినట్లుగా చెబుతున్నారు. సీతక్కతో విబేధాలు అలాగే.. రేవంత్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే మరో వరంగల్ నేత వేం నరేందర్ రెడ్డితో దురుసుగా ప్రవర్తించడం వంటివి జరిగాయని ఈ కారణంగా రేవంత్ కొండా దంపతుల విషయంలో అంత సానుకూలంగా ఉండే అవకాశం లేదని అంటున్నారు.
హైకమాండ్ చెబితే రాజీనామా చేయక తప్పదు !
అయితే కొండా సురేఖ ఎలా లేదన్న రేవంత్ టీం సభ్యురాలు. ఆమె తప్పు చేసినట్లుగా నిర్దారిస్తే అందులో రేవంత్‌కూ బాధ్యత ఉంటుంది. అందుకే రేవంత్ రెడ్డి ఇప్పటికిప్పుడు సురేఖకు సపోర్టు చేసే అవకాశాలు ఉన్నాయని వివాదాన్ని సద్దుమణిగేలా చేసి.. కొంత కాలం సైలెంట్ గా ఉంటే.. మర్చిపోతారని అనుకునే అవకాశం ఉంది. అయితే హైకమాండ్ తప్పనిసరిగా రాజీనామా చేయించాలని ఆదేశిస్తే రేవంత్ కూడా ఏమీ చేయలేరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.