అన్వేషించండి

Case Against Nagarjuna : నాగార్జునకు వరుస సమస్యలు - మాదాపూర్‌ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు

N Convention : నటుడు నాగార్జునపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కబ్జా కేసు నమోదు అయింది. తుమ్మిడి కుంట చెరువును కబ్జా చేశారని ఓ స్వచ్చంద సంస్థ నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Case Registered against actor Nagarjuna at Madapur police station : ఎన్ కన్వెన్షన్ యజమాని , నటుడు నాగార్జునకు వరుసగా కష్టాలు వస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ కేటీఆర్ ఇష్యూలో తమ కుటుంబాన్ని ప్రస్తావించి విమర్శలు చేశారని ఆమెపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న దశలో నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు అయింది. చెరువును కబ్జా చేశారని జనం కోసం అనే స్వచ్చంద సంస్థకు చెందిన  కసిరెడ్డి  భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడికుంటను కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ నిర్మించి లాభాలు ఆర్జించారని భాస్కర్ రెడ్డి తన  ఫిర్యాదులో పేర్కొన్నారు. 

చెరువును కబ్జా చేసి భారీగా సంపాదించారని కసిరెడ్డి  భాస్కర్ రెడ్డి పిటిషన్ 

చెరువును నాగార్జున కబ్జా చేసినట్లు ఇరిగేషన్ అధికారులు ధృవీకరించిన ఆధారాలు కూడా తన ఫిర్యాదుకు జత చేసినట్లుగా తెలుస్తోంది. తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ స్థలంలో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్-కన్వెన్షన్ నిర్మించినట్లు ఇరిగేషన్ శాఖ నార్త్ ట్యాంక్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఫిబ్రవరి 17, 2021న నివేదిక ఇచ్చారని..    వంద కోట్ల విలువైన చెరువు స్థలాన్ని కబ్జా చేసి రెవెన్యూ, ఇరిగేషన్ చట్టాలను ఉల్లంఘించి పర్యావరణాన్ని విధ్వంసం చేశారని ఫిర్యాదులో భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలని కోరారు.  న్యాయసలహా తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు. 

సెంచరీ కొట్టిన టమాటా- అదే బాటలో ఉల్లి- బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు

ఇటీవల భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన హైడ్రా 

ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు ఇటీవలే కూల్చివేశారు. అలా కూల్చివేయడానికి హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసిన వారిలో జనం కోసం స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి  భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయనే పోలీసులకూ ఫిర్యాదు చేశారు. నాగార్జున చాలా కాలం క్రితం మరో పార్టనర్‌తో కలిసి నిర్మించిన ఎన్ కన్వెన్షన్ చెరువులోనే ఉందని చాలా కాలం నుంచి ఆరోపణలు ఉన్నాయి. పదేళ్ల క్రితం కూల్చివేయడానికి బుల్ డోజర్లు  బయలుదేరినా.. ఎన్ కన్వెన్షన్ వద్దకు చేరకుండానే వెనుదిరిగిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు. హై ప్రోఫైల్ వ్యక్తుల ఫంక్షన్లకు ఎన్ కన్వెన్షన్ వేదిక అవుతుంది. 

తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గించండి- ప్రతి భక్తుడి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి- టీటీడీకి చంద్రబాబు కీలక సూచన

కొండా సురేఖపై న్యాయపోరాటం చేస్తున్న నాగార్జునకు చిక్కులు          

ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉంటాయో కానీ..  కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. కొండా సురేఖపై ఇప్పటికే రెండు పరువు నష్టం పిటిషన్లను నాగార్జున దాఖలు చేశారు. ఒక దాంట్లో వంద కోట్ల రూపాయలు పరిహారం ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది. ఈ లోపే ఆయనపై కేసు నమోదు చేయడం.. కబ్జా చేయడం వల్ల ఆయన సంపాదించినదంతా కట్టించాలన్న డిమాండ్ రావడం ఆసక్తికరంగా మారింది.   

టాప్ హెడ్ లైన్స్

Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Hardik Pandya News: హార్దిక్ రాకతో PBKS బ్యాటింగ్ బలపడినా అసలు చిక్కు అక్కడే.. ఆ ప్లేయ‌ర్ లోటు తీర్చకపోతే కప్పు కష్టమే అంటున్న మాజీలు, 18 కోట్ల పర్స్‌పై  చ‌ర్చ‌..
హార్దిక్ రాకతో PBKS బ్యాటింగ్ బలపడినా అసలు చిక్కు అక్కడే.. ఆ ప్లేయ‌ర్ లోటు తీర్చకపోతే కప్పు కష్టమే అంటున్న మాజీలు, 18 కోట్ల పర్స్‌పై  చ‌ర్చ‌..
Lower Back Pain : ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
ప్రపంచాన్ని వేధిస్తున్న నడుము నొప్పి.. 2050 నాటికి బాధితులు 843 మిలియన్లకు చేరే అవకాశం!
Mohammed Siraj Comeback:  రెండోటెస్టుకు ముందు టీమిండియాలో కీలక మార్పు..!! యువ పేసర్‌పై వేటు వేసి సిరాజ్‌కు ఛాన్స్? డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలవాలంటే...
రెండోటెస్టుకు ముందు టీమిండియాలో కీలక మార్పు..!! యువ పేసర్‌పై వేటు వేసి సిరాజ్‌కు ఛాన్స్? డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు నిలవాలంటే...

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy Padayatra: జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
జగన్‌కు పోటాపోటీగా విజయసాయిరెడ్డి పాదయాత్ర - వెన్నుపోటు ఆరోపణలతో ఎటాక్- ఏపీ రాజకీయాల్లో కొత్త సెగ!
CM Revanth Reddy: 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
0 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
Parliament Session: ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
ఈ 30 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్రం అడుగులు
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Embed widget