Tomato And Onion Price:సెంచరీ కొట్టిన టమాటా- అదే బాటలో ఉల్లి- బెంబేలెత్తిపోతున్న వినియోగదారులు
Tomato And Onion Price: పండగ టైంలో టమాటా, ఉల్లిగడ్డలు పరుగు పందెం పెట్టుకున్నట్టు రేటు పెరిగిపోతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో టమాటా సెంచరీ కొట్టేసింది. ఇప్పుడు అదే బాటలో ఉల్లి వెళ్తోంది.
Tomato And Onion Price: టమాటా ధరలు ఒక్కసారిగా సెంచరీ కొట్టేస్తోంది. ఎక్కడ చూసీన 80 రూపాయ కంటే తక్కువకు కిలో టమాటా దొరకడం లేదు. నిన్న మొన్నటి వరకు 50రూపాయల్లోపు ధర పలికే టమాటా ఇప్పుడు ఒక్కసారిగా డబుల్ అయిపోయింది. కొనేందుకు వెళ్తున్న వినియోగదారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఉన్న వాటినోత సరిపెట్టుకుంటున్నారు. అసలే పండగ సీజన్ ఆపై ధర పెరిగిపోవడంతో ఏం తినాలని వాపోతున్నారు.
టమాటా లేనిదే దాదాపు ఎవరింట్లో కూడా వంట పూర్తి కాదు. వెజ్ ఆర్ నాన్‌వెజ్ ఏం వండినా టమాటా ఉంటే ఆ వంటకానికి అదనపు రుచి వస్తుంది. కుటుంబానికి సరిపడేలా వంటకం పూర్తి అవుతుంది.ఇప్పుడు టమాటో వందకు చేరుకోవడంతో వినియోగదారులు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. కొందరు చింతపండును వినియోగిస్తుంటే మరికొందరు నిమ్మకాయలతో సరిపెట్టుకుంటున్నారు.
టమాటా ధర పెరగడానికి కారణేంటీ?
ఈ మధ్యకాలంలో వాతావరణ పరిస్థితులకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయి. అక్కడ పండించే పంట పూర్తిగా నాశనమైపోయింది. అక్కడి దిగుబడి పూర్తిగా పడిపోయింది. మధనపల్లిలో పరిస్థితి అంతే ఉంది. ఈ మూడు ప్రాంతాల నుంచి వచ్చే టమాటా ఒక్కసారిగా తగ్గిపోవడంతో పరిస్థితి మారిపోయింది. మొన్నటి వరకు యాభైరూపాయల వరకు ఉండే టమాటా ధరలు ఇప్పుడు ఏకంగా వంద రూపాయలకు చేరాయి. ఇప్పట్లో ఈ ధరలు తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. మదనపల్లె మార్కెట్‌లోనే టమాటా ధర 80 రూపాయలకుపైగా పలుకుతోంది. అంటే మిగతా ప్రాంతాలకు ఆ సరకు వెళ్లే సరికి వంద రూపాయలకు పైమాటే అంటున్నారు.
టమాటాతో పోటీగా ఉల్లి
ఉల్లిగడ్డల ధరలు కూడా ఆ స్థాయిలోనే కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి సరిపడా సరకు రాకపోవడంతో ఉల్లి రేటు పెరిగిపోతోంది. అది కూడా క్వాలిటీ ఉండటం లేదన్నది వినియోగదారులు చెబుతున్న మాట.