అన్వేషించండి

Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్

Telangana News: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఉదయం నుంచే సెంటర్ల వద్ద అభ్యర్థుల హడావుడి కనిపించింది.

Telangana Group 2 Exams Started: తెలంగాణలో ఆదివారం గ్రూప్ 2 పరీక్షలు (Group 2 Exams) ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల హడావుడి కనిపించింది. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. 783 గ్రూప్ - 2 సర్వీస్ పోస్టుల భర్తీకి ఆది, సోమవారాల్లో పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,368 కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ పోస్టుల భర్తీకి సర్వీస్ కమిషన్ 2022, డిసెంబర్ 29న ప్రకటన జారీ చేయగా 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 4 పేపర్లకు పరీక్ష జరుగుతోంది.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకూ, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. అటు, బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్ష కేంద్రాన్ని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరలోనే ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

కీలక సూచనలివే!

  • అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్‌లోకి 9.30 తరువాత, మధ్యాహ్నం వేళ 1.30 నుంచి 2.30 వరకు అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2.30కు గేట్స్ క్లోజ్ చేస్తారు. పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ప్రతి పేపర్ పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసివేస్తారు.
  • హాల్ టికెట్‌తో పాటు అభ్యర్థులు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు ఐడెంటింటి కార్డు తీసుకువెళ్లాలి. మీ హాల్ టికెట్‌కు లేటెస్ట్ ఫొటో ఒకటి అతికించాలి. కనీసం మీ వెంట ఫొటో తీసుకెళ్తే ఎగ్జామ్ సెంటర్ వద్దనైనా అతికించక తప్పదు.
  • అభ్యర్థులు బ్లూ లేదా ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకురావాలి. వైట్‌నర్, మార్కర్ లాంటి వాటికి అనుమతి లేదు. పేపర్లు, అదనపు స్టేషనరీ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
  • షూస్‌ ధరించిన వారిని ఎగ్జామ్ సెంటర్‌‍లోకి అనుమతించరు. మహిళా అభ్యర్థులను మంగళ సూత్రం, గాజులు మాత్రమే అనుమతి ఉంది. మరే ఇతర ఆభరణాలతో వచ్చినా వారిని సైతం ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతించరు.
  • ఓఎంఆర్ షీట్‌పైన ఎలాంటి సింబల్స్, గుర్తులు రాయకూడదు. కేవలం అందులో సూచించిన విషయాలకు మాత్రమే సమాధానం రాయాలి. డిక్లరేషన్ ఇవ్వాలి. అభ్యర్థులు హాల్ టికెట్ నెంబర్ గానీ, ఎగ్జామ్ పేపర్ షీట్ నెంబర్, ఎగ్జామ్ పేపర్ నెంబర్ గానీ రాంగ్ బబులింగ్ చేసినా, తప్పుగా రాసినా వేరే ఓఎంఆర్ మాత్రం ఇవ్వరు. అన్ని విషయాలు గమనించి జాగ్రత్తగా పరీక్షలు రాయాలి.

Also Read: Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Embed widget