అన్వేషించండి

Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్

Telangana News: యూట్యూబర్ హర్షసాయి కేసులో బాధితురాలి తరఫు లాయర్ కొన్ని యూట్యూబ్, మీడియా ఛానల్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బాధితురాలిపై లేని అభియోగాలు మోపుతున్నారని మండిపడ్డారు.

Youtuber Harsha Sai Victim Lawyer Key Comments: కొన్ని మీడియా, యూట్యూబ్ ఛానల్స్ నిజానిజాలు తెలియకుండా తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నాయని హర్షసాయి (Harshasai) కేసులో బాధితురాలి తరఫు లాయర్ నాగూర్ బాబు మండిపడ్డారు. యూట్యూబర్ హర్షసాయి కేసుకు సంబంధించి బాధితురాలిపై చేస్తోన్న ప్రచారంపై ప్రొడ్యూసర్ బాలచంద్రతో కలిసి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఎక్కడా చూపించలేదు. ఏ కేసు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారనేది ఎవరికీ తెలియదు. రూ.2 కోట్ల కోసమని వస్తున్న ప్రచారాల్లో నిజం లేదు. ప్రస్తుతం హర్షసాయి అనే వ్యక్తి దేశం వదిలిపెట్టి పారిపోయాడు. తను ఇక్కడ లేకపోయినా అతనికి సపోర్ట్‌గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇంస్టాగ్రామ్ పేజెస్‌ని వాడుకుంటూ కేసును తారుమారు చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. బాధితురాలిపై లేని అభియోగాలను మోపుతూ ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్ వాయిస్‌తో ఆడియో ఫైల్స్ రిలీజ్ చేస్తున్నారు.' అంటూ న్యాయవాది మండిపడ్డారు.

కానీ, కొన్ని మీడియా ఛానల్స్ నిజానిజాలు తెలియకుండా వాటిని ఎంటర్టైన్ చేస్తూ బాధితురాలిని ఇబ్బంది పెడుతున్నారని నాగూర్ బాబు అన్నారు. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. 'ఆ ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్‌ని ఎవరైతే టెలికాస్ట్ చేస్తున్నారో డిలీట్ చేయాల్సిందిగా ధర్మాసనం నుంచి ఇంటెరిమ్ ఆర్డర్ తెచ్చుకున్నాం. అదే విధంగా ఎఫ్ఐఆర్‌లో ఫైల్ అయిన కంప్లైంట్ ఏంటో తెలియకుండా కొంతమంది వాదనలకు దిగి ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్‌తో బాధితురాలిని మానసికంగా బాధ పెడుతున్నారు. అలా చేస్తున్న సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌పై న్యాయస్థానంలో కేసు ఫైల్ చేశాం. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ దాసరి విజ్ఞాన్, శేఖర్ భాష, కరాటే కళ్యాణి, మహీధర్ వైబ్స్ పైన కేసు నమోదు చేశాం. సెక్షన్ 356 కింద డిఫర్మేషన్, 72 ఆఫ్ బి ఎన్ ఎస్ కింద కేసులు నమోదు చేశాం. బాధితురాలి పేరు ఎక్కడ కూడా నిజనిర్ధారణ జరిగే వరకు తీయకుండా న్యాయస్థానం నుంచి తగిన చర్యలు తీసుకుంటున్నాం' అని తెలిపారు.

'మానసిక వ్యధకు గురి చేస్తున్నారు'

బాధితురాలు ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి కేసు పెట్టారని.. ఆ తర్వాత ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్‌తో ఆమెను ఎంకో మానసిక బాధకి గురి చేస్తున్నారని నిర్మాత బాలచంద్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'కేసు పెట్టిన రెండో రోజు నుంచే హర్షసాయి ఇబ్బంది పెడుతున్నాడు. దాని కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఫైల్స్‌ని నిజానిజాలు తెలియకుండా ఎవరు ఎక్కడ చూపించరాదని న్యాయస్థానం ఆర్డర్ పాస్ చేసింది' అని పేర్కొన్నారు.

హర్షసాయికి లుక్ అవుట్ నోటీసులు

అటు, ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హర్షసాయిపై నార్సింగి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. గత నెలలో అతనిపై అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలు సేకరించి బెదిరింపులకు పాల్పడ్డాడని ఓ సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, సోషల్ మీడియాలో తనపై ఉద్దేశపూర్వకంగానే ట్రోలింగ్ చేయిస్తున్నాడని మరో ఫిర్యాదును చేశారు. తనపై అసత్యాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి సంబంధించి పలు స్కీన్ షాట్లను పోలీసులకు సమర్పించగా.. దీనిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న హర్షసాయి కోసం గాలిస్తున్నారు. 

Also Read: Crime News: తెలంగాణలో తీవ్ర విషాదాలు - కొడుకు ఆన్ లైన్ బెట్టింగ్‌‌తో అప్పుల పాలు, ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Embed widget